విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా కైకలూరి ఎమ్మెల్యే దులం నాగేశ్వ రావు పనితీరు ఉందని 2013 ఎంపి టిసి, మాజి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తిరువీధుల శారద అన్నారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డిఎన్‌ఆర్ వైసీపీ పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని, జగనన్న సంక్షేమ పథకాలను గడపగడకు తీసుకెళుతున్న క్రమంలో దారిలో 200 మంది పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేశారనీ వాపోయారు. సిఐ, ముదినేపల్లి ఎస్‌ఐ, కైకలూరు ఎస్‌ఐలు 2000 మంది వైసీపీ కార్యకర్తలను మరల ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా అంటూ వారిని దౌర్జన్యంగా మహిళలని చూడకుండా నన్ను ఈడ్చుకుంటుపోయారు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాత్రనక పగలక జగనన్నను సీఎం చేయాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తుంటే మమ్ములను ఈ రకంగా చేయడం సరికాద న్నారు. పోలీసులు ఎమ్మెల్యేలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమ ర్శించారు. మా ఇంటి ముందువారం రోజులనుండి రెక్కి నిర్వహిస్తున్నారు చెప్పారు. జగనన్న ఇచ్చే బంగారు భవిష్యత్‌ను గురించి వివరించాలనే ఉద్దేశంతో గడప గడపకు వెళుతుంటే మమ్ములను లాఠీలతో వెంబడిరచారనీ, ఏమ్మెల్యే ఎప్పుడు పోతాడని కైకలూరు ఓటర్లు ఎదురు చూస్తున్నారని వెల్లడిరచారు.
Prajavartha Online Telugu News