తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని గుంటూరు, తిరుపతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ,యూనిసెఫ్ సహకారంతో స్టడీ మెటీరియల్ ట్యాబ్ లను అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్రీ పద్మావతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు అధ్యాపకులకు టాబ్ లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య రంగంలో ఎప్పటికప్పుడు సాంకేతికత అందిపుచ్చుకొని సామాన్య ప్రజలకు మంచి వైద్యం అందించాల నే ఉద్దేశంతో నేడు స్టడీ మెటీరియల్ కలిగిన ట్యాబ్ లను అందించడం జరిగిందని , సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న మిడ్ వైఫరీ విద్యార్థులు 30 మందికి, పది మంది బోధనా అధ్యాపకులు ట్యాబ్ లను అందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియరోజా, డి ఎం అండ్ హెచ్ ఓ శ్రీహరి, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ పార్థసారథి , నర్సింగ్ కళాశాల అధ్యాపకులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News