Breaking News

ఈనెల 17న ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఈవో గ్రేడ్ 3 పరీక్షలు… : డిఆర్ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 17న ఎండోమెంట్ ఈవో గ్రేడ్ 3 పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఇయాన్ డిజిటల్ రామిరెడ్డి పల్లె పరీక్ష కేంద్రంగా నిర్వహించనున్నట్లు ,,ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం డిఆర్ఓ అధ్యక్షతన డిఆర్ఓ ఛాంబర్ నందు పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. డిఆర్ఓ మాట్లాడుతూ రామిరెడ్డిపల్లి వద్దగల ఇయాన్ డిజిటల్ నందు ఆన్లైన్ ఎక్సమ్ రెండు సేషన్ల లో నిర్వహించనున్నామని ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, అలాగే 2.30 నుండి 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ప్రతి సెషన్ లోను 180 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ,విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ప్రియాంక, ఏఈ ఎలక్ట్రిసిటీ నాగరాజు, ఆర్టీసీ సత్యనారాయణ రెవిన్యూ అధికారులు. పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్ వినియోగం

-విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *