రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి స్థానిక ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. అక్కడున్న వసతులను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి, క్షణికావేశంలో చేసిన నేరాల వల్ల జీవితంలో విలువైన వాటిని ఎలా కోల్పోతారని, కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయో వారికి వివరించారు. న్యాయ మార్గంలో జీవించడం వల్ల గౌరవంతో పాటు ఇతరులకు నష్టం వాటిల్లే పరిస్థితులు రావని వారికి చెప్పారు. పరివర్తన చెంది మంచి మనుషులుగా, బాధ్యత గల పౌరులుగా మారాలని అన్నారు. న్యాయ పరమైన సమస్యలు, సందేహాలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక మహిళా జైల్ పర్యవేక్షకురాలు సిహెచ్. వసంత కుమారి, డా. విజయ లక్ష్మి , మహిళా ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News