Breaking News

విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారుల ఆకస్మిక తనిఖీ…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
విజిలెన్స్ ఎస్.పి. పి.వి.రవి కుమార్, ఐ.పి.ఎస్., గురువారం ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాని వివిధ రెస్టారెంట్ లను ఆకస్మికముగా తనిఖీ చేసి, సదరు రెస్టారెంట్లలో మొత్తం 09 డోమెస్టిక్(గృహ) సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి ఈ దిగువ చూపిన రెస్టారెంట్ల పై 6-ఏ క్రింద కేసులు నమోదు చేసియున్నారు.

1. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరు గ్రామములొ గల దీవెన టిఫిన్ సెంటర్లో వాణిజ్య(కమర్షియల్) సిలిండర్లు బదులుగా 3 (మూడు) డోమెస్టిక్(గృహ) సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి 6-ఏ క్రింద యజమాని పై కేసు నమోదు చేసియున్నారు.
2. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరు గ్రామములొ గల వైష్ణవి ఫుడ్ మెజిక్ హోటల్లో వాణిజ్య(కమర్షియల్) సిలిండర్లు బదులుగా 6 (ఆరు) డోమెస్టిక్(గృహ) సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి 6-ఏ క్రింద యజమాని పై కేసు నమోదు చేసియున్నారు.

ఈ సందర్భముగా ఎస్.పి.  పి.వి.రవి కుమార్ మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించియున్నారు. ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్లు రమేష్, తహశీల్దార్ విజయకుమార్, సివిల్ సప్లయ్స్ డిప్యూటీ తహశీల్దార్ శ్రీమతి జి.డి.మల్లేశ్వరి, కానిస్టేబుల్స్, మహిళా పోలీసు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

-పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 17 టీఎంసీల నీరు తరలింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *