విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా నవరత్నాలు అమలు చేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్,106వ సచివాలయ పరిధిలోని కృష్ణలంక లూకా వారి స్ట్రీట్, వల్లూరి వారి స్ట్రీట్, పోలీస్ రామయ్య స్ట్రీట్,మన్యం వారి స్ట్రీట్,కల్పనా ప్రింటర్స్ స్ట్రీట్, రెహమాన్ స్ట్రీట్ ప్రాంతాలలోనాయకులు, అధికారులు, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కృష్ణలంక లోని ఈ సచివాలయం పరిధిలో అపార్ట్మెంట్ లు ఎక్కువ ఉండి, కాలనీ వాతావరణం ఉంటుందని గత ప్రభుత్వం లో నిర్లక్ష్యం చేయడం వలన రోడ్లు, డ్రైన్స్ మరమ్మతులు చేయకుండ వదిలేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోట్ల రూపాయలు వెచ్చించి నూతన రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మించామని తెలిపారు. అదేవిధంగా సచివాలయనికి మంజూరు అయిన 20లక్షల రూపాయల నిధులతో స్థానికులు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం పోయింది అనే అక్కసుతో అవాస్తవాలు ప్రచురించి జగన్ కుటుంబం మీద పుస్తకం విడుదల చేసారని, రాజకీయాల్లో కి కుటుంబాలను తీసుకొచ్చి వారు చేస్తున్న వికృత చేష్టలు ప్రజలు అసహ్యంచుకొనెల ఉన్నాయని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు చేసిన అన్యాయలను ప్రచురిస్తే పుస్తకాలు కూడా చాలవని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైకి బుద్ధిమంతుడు లా నటిస్తూ ప్రజలను మభ్యపెట్టలని చూస్తారని, విజయవాడ నగరంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఆయనదే కీలకపాత్ర అని, ఇప్పటికి వడ్డీ వ్యాపారాలు ఎలా చేయాలి, మహిళలను ఎలా బెదిరించాలని వారి అనునాయులకు దిశా నిర్దేశం చేస్తుంటారు అని విమర్శించారు. మీ మీద బుక్ వేసి ప్రచురించి ప్రజలకు పంచండి అని ప్రశ్నించారు. యువగళం అంటూ పాదయాత్ర చేస్తున్న లోకేష్ ముందు వారి ప్రభుత్వం లో ఎన్ని హామీలు నెరవేర్చరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి వైసీపీ నాయకులు టి.పి రెడ్డి, ర్రామకృష్ణ, రాజా, సుబ్బారెడ్డి, దుర్గారావు, పెద్దబ్బాయి, రమేష్, దనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News