విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భూముల రీ సర్వేలో సరిహద్దు రాళ్లు పాతే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్షా పథకంలో భాగంగా చేపడుతున్న భూముల రీసర్వే లో సరిహద్దు రాళ్లు పాతే ప్రక్రియపై గురువారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ ,రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దారులు సర్వేయర్లతో కలెక్టర్ ఢిల్లీ రావు గూగుల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు విజయవాడ రూరల్ నున్న గ్రామంలోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కు వెళుతూ వాహనం నుండి నిర్వహించిన గూగుల్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 14 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. రీ సర్వేలో భాగంగా సరిహద్దురాళ్లు పాతే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో సరిహద్దురాలు పాతడం పూర్తి చేయడం జరిగిందని ఇంకనూ మిగిలిన 13 గ్రామాల్లో పాతెందుకు సిద్ధంగా ఉన్న 23వేల సరిహద్దు రాళ్లను ఆరు వారాల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు.
Prajavartha Online Telugu News