విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాసాబత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన కేసిఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా శ్రీనివాస్ విలేఖరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కాబోయే ప్రధాని మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ అదేనేత కే సి ఆర్ అని జోస్యం చెప్పారు. నేటి వరకు కేంద్రం ఏపి కి విభజన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. పోలవరం కు నిధులు కేటాయించలేదని, స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి సిద్దం అయ్యారని వాక్యానించారు. బి ఆర్ ఎస్ పార్టీ అధికారం లో కి రాగానే రాష్ట్రానికి కావాల్సినవి అన్ని సమకూరుస్తారనీ వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ది పదం లో నడిపిస్తారనీ చెప్పారు. దేశం లోని అన్ని ప్రాజెక్టులు కేంద్రం అదానికే అపజెప్పుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు బుచ్చినేని వంశీ, వాడపల్లి సతీష్, తోటకూర కోటేశ్వరరావు, మహిళా నాయకురాలు మీన తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News