-22వ భారత్ రంగ్ మహోత్సవ్ 2023 (థియేటర్ ఫెస్టివల్)
-రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదికగా
-పోస్టరును ఆవిష్కరించిన కలెక్టరు డా.కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనలను ప్రదర్శించడానికి ఫిబ్రవరి 19 నుండి 23 వరకు 22వ భారత్ రంగ్ మహోత్సవ్ 2023 (థియేటర్ ఫెస్టివల్) నిర్వహించడం శుభపరిణామని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరు వారి ఛాంబరులో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) ఫిబ్రవరి 19 నుండి 23 వరకు 22వ భారత్ రంగ్ మహోత్సవ్- 2023 (థియేటర్ ఫెస్టివల్) పోస్టరును కలెక్టరు మాధవీలత, కమీషనర్ కె.దినేష్ కుమార్, ప్రిన్సిపాల్ యం. కృష్ణమోహన్ తో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు కే. మాధవీలత మాట్లాడుతూ తెలుగు నాటకరంగం దాదాపు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి మూలాలను కలిగి ఉందని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించిందన్నారు. నేడు సినిమా పట్ల ఆదరణ పెరగడంతో చాలా మంది దర్శకులు, నటులు, రచయితలు అలాగే సాంకేతిక నిపుణులు నాటక రంగం నుంచే చిత్ర పరిశ్రమకు వలస వచ్చారని పెర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి సంస్థను రాజమండ్రిలో ప్రాంతీయ కేంద్రంగా ఏర్పాటు చేయడం శుభపరిణామ మన్నారు. తద్వారా ఈ ప్రాంతీయ కేంద్రం తెలుగు నాటకరంగానికి సహాయం చేయడమే కాకుండా రాష్ట్రంలో చాలా మంది కళాకారులకు జీవనోపాధికి చక్కటి అవకాశం ఏర్పడుతుందన్నారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) తరపున విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ యం. కృష్ణమోహన్ మాట్లాడుతూ ఎస్ ఎస్ డి ప్రాంతీయ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో స్థాపించడానికి ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనలను ప్రదర్శించడానికి 2023 ఫిబ్రవరి 19 నుండి 23 వరకు రాజమహేంద్రవరంలో 22వ భారత్ రంగ్ మహోత్సవ్ 2023 (థియేటర్ ఫెస్టివల్) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ఐదు రోజులు పాటు ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భారత్ రంగ్ మహోత్సవ్ 2023 కార్యక్రమ వివరాలు :
19 ఫిబ్రవరి న శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ గ్రూప్, హైదరాబాద్, తెలంగాణ వారిచే “భక్త ప్రహ్లాద” నాటకం.
20 వ తేదీ అస్థిత్వ థియేటర్ గ్రూప్, మంగుళూరు, కర్ణాటక వారిచే “కొండోనియన్స్” నాటకం.
ఫిబ్రవరి 21 న అస్పోర్టివ్ థియేటర్ స్పేస్ గ్రూప్ ద్వారా, పాలక్కాడ్, కేరళ వారిచే “లిబ్ (లెట్ ఇట్ బోదర్)” నాటకం.
ఫిబ్రవరి 22 న బ్యాక్ ఆన్ స్టేజ్ థియేటర్ గ్రూప్, బెంగళూరు, కర్ణాటక వారిచే “స్మశాన కురుక్షేత్రం” నాటకం.
ఫిబ్రవరి 23 న మంగు థియేటర్ ల్యాండ్ గ్రూప్, కోవిల్పట్టి, తమిళనాడు వారిచే “ఇదకిని కథయారథం” నాటక ప్రదర్శన
Prajavartha Online Telugu News