సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికల సాధనపై అధికారులు దృష్టి పెట్టాలి.

-ఎస్ డి జి లక్ష్యాల పురోగతిపైనే ప్రపంచ దేశాలలో దేశ, రాష్ట్ర ర్యాంకింగ్. : కార్యదర్శి విజయ్ కుమార్
-ప్రతి అధికారి ఎస్. డి. జి. లక్ష్యాల సూచికలు అమలు భాద్యత తప్పనిసరి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికల (SDG)పై అధికారులు అవగాహన పెంపొందించుకుని, వాటిపై దృష్టి పెట్టి సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని, వాటి ఆధారంగానే ప్రపంచ దేశాల అభివృద్ధి, నాణ్యమైన జీవన విధానం, మానవజాతి అభివృద్ది, జంతుజాల సంరక్షణ కు దోహదం చేస్తుందని, అందులో మన దేశ, రాష్ట్ర ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుందని ప్లానింగ్ విభాగ కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు.

శుక్రవారం ఉదయం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఏర్పాటు చేసిన ఎస్. డి. జి., స్పందన ఓరియంటేషన్ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, జే సి డి కే బాలాజీ, మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి , చిత్తూరు , తిరుపతి జిల్లాల జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి, మండల స్థాయి, పోలిస్ అధికారులు పాల్గొన్న కార్యక్రమాన్ని అన్ని సచివాలయాల సిబ్బంది వీక్షించే విధంగా యుట్యుబ్ లింక్ ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. .

ఈ సందర్భంగా ప్లానింగ్ కార్యదర్శి మాట్లాడుతూ మానవ జాతి అభివృద్ధి కోసమే ప్రపంచ దేశాలు సమావేశమై ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రప్రంచ దేశాలు ఒకతాటిపై యునైటెడ్ నేషన్స్ లో 2000 సంవత్సరంలో ఎనిమిది అంశాలు 15 సంవత్సరాల కాలపరిమితితో సుస్థిరమైన అభివృద్ధి సాధన ఉండాలని నిర్దేశించారని అందులో ప్రధాన అంశాలు పేదరిక నిర్మూలన, ప్రాధమిక విద్యను ప్రోత్సహించడం ,అటవీసంపద కాపాడటం నిర్దేశిచుకున్నారని అన్నారు. 2015 మరో 30 సంవత్సరాల్లో మెరుగైన ఎస్.డి.జి. అంశాలు పేదరిక నిర్మూలన, పేదల ఆకలి తీర్చడం, ఆరోగ్యజీవనం, విద్య తప్పనిసరి చేయడం,పరిసరాల పరిశుబ్రత, విద్యత్, ఆర్థక ఎదుగదల, పరిశ్రమలు స్థాపన, సమాజ సమానత్వం, నీరు, వాతావరణం, భూమిని , సముద్ర జల జీవుల రక్షణ , శాంతి , చట్టాలు అమలు, సంతోష ఆర్ధిక జీవనం వంటి అంశాలతో అభివృద్ధి నుండి ఏఒక్కరిని మినహాయించ రాదని అందరి జీవితాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలి మేధావులు నిర్దేశించారని, మనం భాద్యతతో అమలు చేసి మానవజాతి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

భారత దేశం మిగిలిన ప్రపంచ దేశాలతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలను అమలు చేసి 2030 నాటికి లక్ష్యాలను సాదించే దిశగా దేశంలోని అన్ని రాష్ట్రాలు వీటిపై దృష్టి సారించి లక్ష్యాలను సాదించటమే ఈ సూచీల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

ఎస్. డి. జి. లో సామాజిక, ఆర్ధిక, పర్యావరణ మరియు సుపరిపాలన కేటగిరీలలో అత్యంత ముఖ్యమైన 17 ప్రాధాన్యత అంశాల సూచికలైన పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, సురక్షితమైన నీరు, పరిశుభ్రత, అసమానతల తొలగింపు, ఉపాధి , ఆర్ధిక అభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, శాంతి, న్యాయ వ్యవస్థలు వాతావరణ పరిరక్షణ తదితర అంశాలపై దృష్టి సారించి వాటిని అమలు పరచే దిశ లో అందరు అధికారులు బాధ్యతా యుతంగా, ప్రణాళికా బద్దంగా పనిచేయాలని సూచించారు. మనసుతో పని చేస్తే చేసే పనిలో కష్టం అనిపించదు అని ఇష్టంతో చేసే పని ఎప్పటికీ కష్టం కాదని అన్నారు.

తిరుపతి, చిత్తూరు జిల్లాలలోని జిల్లా స్థాయి, మండల స్థాయి, మున్సిపల్ స్థాయి, గ్రామ, వార్డు స్థాయి అధికారులు ఈ ఈ వర్క్ షాప్ ను సద్వినియోగం చేసుకుని లక్ష్యాల పురోగతిపై ఎప్పటికప్పుడు వారు మండల స్థాయి/ మున్సిపల్ స్థాయి గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో వారి సిబ్బందిని సమీక్ష చేయాలని తదనుగుణంగా లక్ష్యాల సాథన దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పూర్తి అవగాహనతో వాటి ప్రాముఖ్యత తెలుసుకుని వాటిని అందిపుచ్చుకుని జిల్లా స్థాయి నుండి గ్రామ వార్డు స్థాయి వరకు క్షేత్ర స్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేసేలా ఉండాలని అన్నారు. జిల్లా స్థాయిలో వివిధ శాఖలు వారు అమలు చేస్తున్న పథకాలలో గల మొత్తం 61 సూచికలను బాధ్యతగా పర్యవేక్షించాల్సి ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రణాళిక శాఖ కార్యదర్శి వారు ఏర్పాటు చేసిన ఎస్ డి జి లక్ష్యాల సాధన వర్క్ షాప్ ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రతి అధికారి బాధ్యతా యుతంగా వారి రోజువారి విధులలో భాగంగా ఎస్. డి. జి. లక్ష్యాల సూచికల అమలు, పర్యవేక్షణ అలవరుచుకోవాలని సూచీలకు సంబంధించిన పురోగతి సమాచారాన్ని తప్పకుండా ఆన్ లైన్లో నమోదు చేసి ఖచ్చితత్వాన్ని సరిచూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందని అన్నారు. అనీమియా, హెచ్. బీ .శాతం తక్కువ గల గర్భిణీ, బాల బాలికలకు, ఎత్తు బరువు ఎదుగుదల లోపం వంటి లోపాలతో బాధ పడుతున్న పిల్లలకు వైద్య శాఖ, అంగన్వాడి కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, మందులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని అన్నారు. నాయుడుపేట రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను సందర్శించిన సందర్భంగా 630 మంది విద్యార్థులు అనీమియాతో బాధ పడుతున్నట్లు గుర్తించామని వారికి రెగ్యులర్ గా అందచేస్తున్న పాలు, గుడ్డు, చిక్కీలతో పాటు స్థానిక దాతల సహకారంతో వారికి అదనపు ఆహారంగా పాలు, గుడ్లు తదితర పౌష్టిక ఆహారం అందించడం ద్వారా వారిలో నలుగురు మినహా అందరూ రెండు నెలల్లో అనీమియా బారి నుండి బయట పడ్డారని గుర్తు చేశారు. సి.ఎస్.ఆర్. నిధులతో అవసరం వున్నచోట అదనపు పౌష్టికాహారం అందిచడానికి సిద్దంగా ఉన్నామని వివరించారు.
వైద్య, మహిళల శిశు సంక్షేమం, పోలిస్ , స్పందన, పంచాయితీ రాజ్ శాఖలు సీనియర్ కన్సెల్ టెంట్లు ఎస్.డి.జి. లక్ష్యాల సాధనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వార అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారులు అశోక్ కుమార్ రెడ్డి, లక్ష్మీదేవి, చిత్తూరు, తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారులు రాజశేఖర్, శ్రీనివాస రావు, అదనపు ఎస్పీ జగదీష్, ఆర్డీఓ లు, పోలీస్ అధికారులు, మునిసిపల్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *