తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో హద్దు రాళ్ళ ను నాటడం పూర్తికావాలని, ఇప్పటికే ఇంటి పట్టాలు అందించిన వారి వివరాలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని జెసి డి.కె.బాలాజీ సూచించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలోని ఆర్దిఒ లతో , తహసిల్దార్లతో , సర్వేయర్లతో జెసి, డి ఆర్ ఓ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జెసి మాట్లాడుతూ ఎన్నికల విధులు కేటాయించిన సర్వేయర్లు సూచించిన మేరకు హాజరు కావలసి ఉంటుందని, రీ సర్వే పనులను కూడా అనుకున్నసమయం మేరకు పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. అసైన్డ్ భూముల జాబితా సిద్డంచేయాలని, మ్యుటేషన్లకు సంబందించి వారసులు ఒకరు వున్నచోట తక్షణమే పూర్తిచేయాలని అన్నారు. రీసర్వే సమయంలో ఖాతాలో చిన్న తప్పులు కూడా లేకుండా చూడాలని అన్నారు. నాయుడుపేట జాతీయ రహదారి సంబంధించి భూసేకరణ త్రి-డి పూర్తి కావాలని సూచించారు. డి ఆర్ ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎం.ఎల్.సి.ఎన్నికలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు మేరకు ప్రవేటు పాటశాల ఉపాద్యాయులు డి ఇ ఓ కౌంటర్ సంతంకం లేనివి ఓటరుగా ఆమోదించ రాదని అన్నారు. చిన్న పొరపాటుకు తావులేకుండా క్లైముల పరిశీలన వుండాలని అన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు సిబ్బంది సూచించిన తేదీలల్లో శిక్షణకు, విధులకు హాజరు కావాలని అన్నారు. ఈ సమీక్షలో ఆర్దిఓ లు కనకనరసా రెడ్డి, కిరణ్ కుమార్ , చంద్ర ముని, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ కోదండరామి రెడ్డి, ఎ డి సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ జయరాజ్ , తహసిల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News