గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి !!

-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి జగనన్న గృహ నిర్మాణ పథకం, పనుల ప్రక్రియను వేగవంతంగా, యుద్ధప్రాతిపదికన చేసి త్వరితగతిన లక్ష్యాన్ని అధిగమించాలని.. జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో జరిగిన మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాలు, గడప గడపకు మన ప్రభుత్వం, కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై ఆయన విస్తృతంగా సమీక్షించారు. జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలన్నారు. తొలుత ఆయన జగనన్న కాలనీలు, నిర్మాణ పురోగతి, మౌలిక వసతులు, జగనన్న సంపూర్ణ గృహహక్కు, ఓటీఎస్ ప్రక్రియల యాక్షన్ ప్లాన్ తో పాటు. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, పురోగతి తదితర అంశాలపై, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులు, హౌసింగ్ ఇంజినీర్ అధికారులతో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని పలు శాఖల అధికారులతో సంభాషించారు. జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని లే అవుట్లలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ మండల వారిగా ఒక్కొక్కరిని అడిగి సమాచారం తెలుసుకున్నారు. లక్ష్య సాధన కోసం మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వారం ప్రగతి నివేదికలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా, హోసింగ్ పిడి జీవి సూర్యనారాయణ, డి ఆర్ డి ఎ, మెప్మా పి డి బీ ఎస్ ప్రసాద్ హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *