అంబేద్కర్ స్మృతివనము, విగ్రహం సకాలములో పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాము… రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్. వై.శ్రీలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు మరియు స్మృతివనం పనుల యొక్క పురోగతిని మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్.వై.శ్రీ లక్ష్మీ IAS., విజయవాడ నగర పాలక కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలసి పనులను పర్యవేక్షించారు. విగ్రహ ఏర్పాటుకై సిద్ధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహా భాగాల తయారీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్బంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయి వివరిస్తూ, అనుకున్న సమయానికి అంబేద్కర్ స్మృతివనం, విగ్రహం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతము చేస్తూన్నట్లు తెలిపారు..

మొత్తం ’13’ భాగాలతో విగ్రహం ఏర్పాటు
ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను 80 అడుగుల పీఠంపై 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాట్లు ఈ విగ్రహా ఏర్పాటులో విడి విడి గా భాగాలను సిద్దం చేస్తున్నారని వివరించారు. ఈ విగ్రహం మొత్తం 13 భాగాలుగా తయారు చేస్తున్నట్లు అన్ని భాగాలు కలిపి చాలా జాగ్రత్తగా విగ్రహ నిర్మాణం చేపట్టవలసి ఉందని తెలిపారు. ఈ కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కెఫ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి కావాల్సిందన్నారు. ఈ పర్యటనలో పలువురు ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *