Breaking News

ఎంపికైన క్రీడాకారులు ప్రతిభ చూపాలి….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో రాష్ట్రస్థాయి టీమ్ కు జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ప్రతిభ చూపాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం యనమలకుదురు కేకే అకాడమీకి చెందిన అండర్ 19 బాలుర టీమ్ కు ఎంపికైన బి యశ్వంత్, బాలికల విభాగంలో పి .రంగలక్ష్మి, అండర్ 15 విభాగంలో ఎంపికైన ఎన్ .లాక్షణ్య స్తుతి లను జాయింట్ కలెక్టర్ క్రికెట్ బ్యాట్లను అందించి అభినందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేకే అకాడమీ ప్రతిభగల క్రికెట్ క్రీడాకారులను రాష్ట్రానికి అందించడం శుభసూచకం అన్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి క్రికెట్ టీమ్ కు ప్రాతినిధ్య వహించి దేశ అంతర్జాతీయ పోటీలలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ ను కలిసిన వారిలో కేకే అకాడమీ స్థాపకులు డి. వంశీ ప్రియ, హెడ్ కోచ్ జానకిరామ్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

-పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు 17 టీఎంసీల నీరు తరలింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *