-విద్యార్థులలో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పదం, నైపుణ్యం పెంచేందుకు సైన్స్ ఎగ్జిబిషన్స్..
-నూతన ఆలోచనలకు శాస్త్రీయ పరిజ్ఞానం దోహదపడుతుంది..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులలో సైన్స్ పట్ల ఆశక్తి కల్పించి సృజనాత్మకత నైపుణ్యం శాస్త్రీయ దృక్పదంతో శాస్త్ర సాంకేతిక వైద్య రంగాలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
స్థానిక పటమట కోనేరు బసవపున్నయ్య చౌదరి బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల జిల్లా స్థాయి విద్యా` వైజ్ఞానిక ప్రదర్శన `2023ను శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రారంభించి, విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన సైన్స్ పరికరాలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధామిక స్థాయి నుండే విద్యార్థులలో సైన్స్ పట్ల ఆశక్తి కల్పించి సృజనాత్మకత నైపుణ్యం శాస్త్రీయ దృక్పదంతో శాస్త్ర సాంకేతిక వైద్య రంగాలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సి.వి.రామన్ అబ్దుల్‌కలాం వంటి ఎంతో మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజులలో కొత్త కొత్త ఆలోచనలతో రీసెర్చ్ చేసిన ఫలితాల ద్వారా ప్రపంచంలోనే దేశ ప్రతిష్టతను అగ్రభాగాన నిలిపారన్నారు. వారి స్పూర్తితో ఇన్నోవేటెడ్ రీసెర్చ్ చేసేలా విద్యార్థులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పై ఆసక్తిని పెంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం వుందన్నారు. విద్యార్థులలో సృజనాత్మక ప్రతిభను వెలిక తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలలో నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకుని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యారంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
జిల్లా విద్యా శాఖాధికారిని సివి రేణుక మట్లాడుతూ ఎన్‌టిఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎకో ఫెండ్లీ మెటీరియల్, హెల్త్ అండ్ క్లీన్లీనెస్, సాఫ్ట్‌వేర్ అండ్ యాప్స్, ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లయిమెట్ చేంజస్, మాథమేటికల్ మోడలింగ్ అంశాలపై సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన సైన్స్ నమూనాలను రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన 170 ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శనలు నిర్వహించడం జరిగిందని వాటిలో మండల స్థాయి నుండి 5 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. మండల స్థాయిలో ప్రధమ బహుమతి పొందిన 85 ప్రాజెక్టులను జిల్లా స్థాయి ఎగ్జిబిషన్లు ప్రదర్శిస్తున్నారని వీటిలో 10 అత్యుత్తమ ప్రదర్శనలను ఈనెల 27,28 తేదిలలో రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా విద్యార్థులు విజయం సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రముఖ శాస్త్రవేత్తలు డా. శ్రీనివాస రామానుజన్, ఎపిజె అబ్దుల్‌కలాం, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ, ఏపి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టి. శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, డిప్యూటి డిఇవో గౌరి శంకర్, పాఠశాలల ఉపతనిఖీ అధికారి రవికుమార్, జిల్లా సైన్స్ అధికారి హుస్సేన్, ఏపిసి మహేశ్వరరావు, జడ్పి హైస్కూల్ హెచ్‌మ్ ప్రేమసాగర్, జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News