Breaking News

మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివరాత్రి పవిత్ర పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. శివభక్తులకు మహా శివరాత్రి అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగ కాగా ఈ వేడుకను ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారన్నారు. శివరాత్రి రోజు శివుడిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ఈ శుభ సందర్భం మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం యొక్క ఉదాత్తమైన ఆలోచనలను ప్రేరేపిస్తుందని బిశ్వభూషణ్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును పరిరక్షించుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *