Breaking News

హేలాపురి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరసవిల్లి అరవింద్‌

-మరో మైలురాయిని చేరుకోవడంపై సర్వత్రా హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎక్సెల్లా విద్యాసంస్థల అధినేత అరసవిల్లి అరవింద్‌ తనదైన జైత్రయాత్ర సాగిస్తున్నారు. తన ప్రతిభా పాటవా లతో మరో మైలురాయిని చేరుకున్నారు. ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంలోనిహేలాపురి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ కాలేజీ`హిట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ హేలాపూరి టెక్నాలజీ అండ్‌ సైన్స్‌` హిట్స్‌…ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సత్తుపల్లిలోని శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి అనుబంధ సంస్థగా రాణిస్తోంది. శ్రీ గాయత్రీ ఎడ్యుకేషనల్‌ సంస్థ అనుబంధ కళాశాల హిట్స్‌కు అరసవిల్లి అరవింద్‌ ఉపాధ్యక్షులుగా రావడంతో నూతన వన్నె వచ్చిందని హిట్స్‌ బృందం హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో హిట్స్‌ సూపర్‌ హిట్‌ అవుతుందని అభిలషించారు.
2008లో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న శ్రీగాయత్రీ విద్యా సంస్థకు అను బంధంగా ఉన్న హిట్స్‌..గత 15 సంవత్సరాలుగా తనదైన సేవలతో రాణిస్తోంది. ఏలూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో బీటెక్‌, ఎంటెక్‌ కోర్సులను అందిస్తోంది. ఇంజినీరింగ్‌లో ఇతర కాలేజీలకు దీటుగా సాంకేతిక ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఇదిలా ఉండగా…తాజాగా ఈనెల 16న హేలాపురి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌`హిట్స్‌కు అరసవిల్లి అరవింద్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడంతో కళాశాల కొత్త పుంతల దిశగా అడుగులు వేసేందుకు బీజంపడిరది. ఇప్పటికే దేశ, విదేశాల్లో ఎక్సెల్లా సంస్థతో..వేలమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన అరసవిల్లి అరవింద్‌..అదే రీతిలో హిట్స్‌ను కూడా పతాకస్థాయికి చేర్చుతారనే నమ్మకం ఏర్పడిరదని శ్రీ గాయత్రీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షులు ఇరువురి విజయరమేశ్‌ ఆకాంక్షించారు. ఎక్సెల్లా సంస్థ సాధించిన ఫలితాల బాటలోనే హిట్స్‌ను కూడా తీర్చిదిద్దుతారని విజయరమేశ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎక్సెల్లా అధినేత అరసవిల్లి అరవింద్‌ విద్యా వ్యవస్థలో సాధిస్తోన్న పురోగతిపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో తీసుకువస్తోన్న విప్లవాత్మక మార్పులు తనకు స్ఫూర్తినిచ్చాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో అరసవిల్లి అరవింద్‌ చెప్పారు. ఇందులో భాగంగా అరసవిల్లి అరవింద్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఇప్పటికే తుళ్లూరు మండలం మందడంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను దత్తత తీసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న తరగతి భవనాల ఆధునికీకరణకు సంకల్పించిన తీరును సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశంసించారు. అరసవిల్లి అరవింద్‌ స్ఫూర్తితో యువత సేవారంగంలోకి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంతల రహిత రహదారులతో పాటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *