తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరగనున్న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మార్చి 21 వరకు ఎన్నికల కోడ్ వున్నందున , అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమం ఈ నెల తేది లు 20, 27 మార్చి 6, 13, 20 న రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత స్పందన కార్యక్రమం మార్చి 27 సోమవారం నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని, జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ ఆప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News