Breaking News

ప్రాధమిక స్థాయి నుండి విద్యార్థులకు చేతివ్రాత పై శిక్షణ అవసరం

-విద్యాభివృద్ధి ఉత్తమ ఫలితాల సాధనలో చేతివ్రాతే ప్రాధమిక సాధనం.
-ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేతివ్రాతపై శిక్షణ అందించేందుకు చర్యలు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల విద్యాభివృద్ధి ఉత్తమ ఫలితాల సాధనలో చేతివ్రాతే కీలకమని ప్రాధమిక స్థాయి నుండి చేతివ్రాతపై పట్టు సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేతివ్రాతపై శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు.
హ్యాండ్ రైటింగ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఎస్ . ఢిల్లీరావు శనివారం ఆయన కార్యాలయంలో ప్రశంసా అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ చేతివ్రాత నిపుణుడు పి. భువనచంద్ర ఆధ్వర్యంలో చేతివ్రాతలో శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భువనచంద్ర సహకారంతో చేతివ్రాతపై శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోబుతున్నామన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉత్తమ ఫలితాల సాధనకు చేతివ్రాత ఎంతో దోహదపడుతుందన్నారు. చేతివ్రాత బాగుంటేనే తలరాత బాగుంటుందనే పెద్దలన్నా సామెత అక్షర సత్యం అన్నారు. చేతివ్రాత శైలి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుందంటారు. చేతివ్రాత అనేది అక్షరాల అకృతి అని అక్షరాల సగటు పరిణామం మందం చేతివ్రాతను నిర్వచించే లక్షణాలన్నారు. వ్రాసే అక్షరాలు సరిగా ఉంటేనే ఎక్కువ శ్రమ లేకుండా చదవి భావనను సులభంగా అర్ధం చేసుకోగలుగుతారన్నారు. చేతివ్రాత విద్యార్థులకు నోట్స్ వ్రాయడం, హోమ్ వర్క్, క్లాస్ వర్క్ లు చేయడం పరీక్షలు వ్రాయడంతో పాటు అనేక ఇతర పనుల కోసం ఉపయోగించే అత్యంత సాధనమన్నారు.

ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులు చేతివ్రాత బాగున్నపుడు విద్యార్థులు సబ్జెక్టుల గురించి అందించే సమాధానాలపై అనుకూల ప్రభావాలను చూపుతుందన్నారు. విద్య పరంగా ఎంత మంచి జ్ఞానం సంపాదించినప్పటికీ పరీక్షలు వ్రాసేటప్పుడు సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానంతో పాటు చేతివ్రాత తోడైనప్పుడు విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారన్నారు. హ్యాండ్ రైటింగ్ ట్రైనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయ చేతివ్రాత పోటీలలో దేశవ్యాప్తంగా 30 లక్షల మంది పాల్గొనడం చేతివ్రాత విశిష్టతను తెలియజేస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 170 మంది విద్యార్థులు పాల్గొనగా ఉన్నత స్థాయిలో ఎస్. జీవితేష్, అవ్యక్తా, ప్రద్యుమ్నా పూజారి ప్రాధమిక స్థాయిలో జి. జ్ఞాన శ్రీనిధి లు ఛాంపియన్ షిప్ సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. చేతివ్రాత నిపుణుడు భువనచంద్ర జిల్లా విద్య శాఖ అధికారి సమన్వయంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేతివ్రాత శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించుతామన్నారు. హ్యాండ్ రైటింగ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది సర్టిఫికెట్లు అందుకున్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కొంత సమయాన్ని కేటాయించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేతివ్రాతపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరుతున్నామన్నారు.
కార్యక్రమంలో జాతీయ చేతివ్రాత నిపుణుడు పి. భువనచంద్ర, అమలి పాఠశాల ప్రిన్సిపాల్ వై. రాజకుమారి, శుభోదయ పాఠశాల ప్రిన్సిపాల్ బి. శైలజ, ఫ్యాకల్టీలు సిహెచ్. నళిని, యం. శ్యామ్ కుమార్, యం.కె. ఎస్తేరు, పద్మజ్యోతి, ఎ. భావన, జి. జ్ఞానేశ్వరి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సంత్ రవిదాస్ కలశ యాత్రతో సామాజిక ఏకత్వానికి పిలుపు

-కుల, మత భేదాలను వీడి సమానత్వం వైపు సాగాలి: పీవీఎన్ మాధవ్ -వారణాసి నుంచి వచ్చిన పవిత్ర కలశాలకు విజయవాడలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *