విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న కృష్ణలంక, ఎన్టీఆర్ సర్కిల్,రామలింగేశ్వర నగర్,పాటమట లంక,తోట వారి వీధి శివలయాలలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. తదనంతరం వైస్సార్సీపీ కార్పొరేటర్ లు, డివిజన్ ఇన్ ఛార్జ్ లు, నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను అవినాష్ ప్రారంబించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆ పరమేశ్వరుని దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకొంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు వైస్సార్సీపి కార్పొరేటర్లు, ఇంచార్జ్లు,వైస్సార్సీపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News