జీవో నెంబర్ వన్ రద్దు చేయాలి… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జీవో నెంబర్.1 ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకోవాలని, ఈ జీవో ప్రజాస్వామ్యం పై కత్తి పెట్టడమేనని, సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిలువెత్తు నిదర్శనమని, సీఎం జగన్ ది బ్రిటిష్ డిఎన్ఏ అని, అందుకనే దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తదుపరి కూడా ఆ పాలకుల జీవోలను నేడు అమలు చేస్తున్నారని, జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నందున ప్రతిపక్షలా గొంతు నొక్కేందుకే ఈ జీవో జారీ చేశారని, ఇటువంటి దుర్మార్గమైనటువంటి జీవోను రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఈ జీవోను రద్దు చేసేంతవరకు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు కలిసి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.MBVK పౌర హక్కుల సంఘం వారు నిర్వహించిన సదస్సుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియజేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు లతో కలసి పోతిన వెంకట మహేష్ జీవో నెంబర్ వన్ రద్దు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *