వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతు పార్టీలో చేరడం శుభపరిణామం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పుప్పాల కుమారి  అధ్యక్షతన వైస్సార్సీపి నాయకులు దనుంజయ్,పంతాల సాయి,శేఖర్,బి.సి నాయకులు కసగాని దుర్గారావు ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలో పనిచేస్తున్న కంపెళ్ళ భాను లక్ష్మీనారాయణ నాయకత్వంలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు వైస్సార్సీపీ లో చేరడానికి ముందుకు రాగా అవినాష్ వారందరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ గారు రాష్ట్రంలో జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతు తో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అందుకే 20 ఏళ్లుగా సీపీఎం పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన లక్ష్మీ నారాయణ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ఆయన అనుభవానికి సముచిత స్థానం ఇచ్చేలా పార్టీలో గౌరవం ఇస్తామని, కొత్త పాత నాయకుల కలయిక లో తూర్పు నియోజకవర్గంలో వైస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,కార్పొరేటర్ పుప్పాల కుమారి హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కసాగాని జ్యోతి,గాంధీ కోపరిటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు,డివిజన్ అధ్యక్షులు టి.పి రెడ్డి,దనుంజయ్,పంతాల సాయి,శేఖర్,బి.సి నాయకులు కసగాని దుర్గారావు,పుప్పాల రాజా,పుప్పాల సుబ్బారావు,సుంకర పెద్దాబ్బాయి,సుబ్బారెడ్డి,శివారెడ్డి,తిరుపతి రెడ్డి,పురుషోత్తపట్నం రవి,మెడ రమేష్,కొర్ర శ్రీను మరియు డివిజన్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *