Breaking News

విస్తృతంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ సేవ కార్యక్రమాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో రాజకీయాలకు అతీతంగా విద్య, ఉపాధి, వైద్య సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ట్రస్ట్ ఛైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ కు చెందిన 7 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం 1 ఇస్త్రీ బండ్లు,5 తోపుడు బండ్లు, 1 టిఫిన్ బండి ని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక నాయకులతో కలిసి అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో నివసించే వీరు అద్దె బండ్లుతో ఇబ్బందులు పడుతున్నామని తమకు జీవనోపాధి కి సహాయం చేయాలని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరగా వారు తక్షణమే ఆ విషయం మా దృష్టికి తీసుకురాగా నేడు వారికి దాదాపు 1లక్ష 50వేల రూపాయల విలువ గల బండ్లు ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగిందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. నిరుపేదలకు అండగా నిలిచిన దేవినేని నెహ్రూ  మరణించిన నాటి నుండి కూడా ఆయన ఆశయసాధనకు కృషి చేస్తూ ట్రస్ట్ ద్వారా పార్టీలకతీతంగా అవసరమైన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతామని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,తూర్పు కాపు డైరక్టర్ ఇజ్జాడ తేజేష్,వైస్సార్సీపీ నాయకులు అబ్బి నాయుడు,ప్రభు,శ్రీను,సంపత్,హరీష్ మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టూరిజం ఎండీ పట్టన్ శెట్టి రవి సుభాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *