విజయవంతంగా బీఎన్ఐ ఏపీ నెట్వర్కింగ్ కాన్క్లేవ్

-వివిధ రంగాల ప్రముఖులతో పాటు, 1500 మంది ప్రతినిధుల హాజరు
-వాణిజ్యవేత్తలకు స్ఫూర్తిదాయకంగా అన్నాదురై ప్రసంగం
-నెట్వర్కింగ్ సదస్సు లక్ష్యం నెరవేరిందన్న బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యాపారవేత్తల నడుమ స్నేహ బంధాన్ని నెలకొల్పి, పరస్పర వ్యాపారాభివృద్ధి దిశగా అడుగులేసే లక్ష్యంతో, బీఎన్ఐ విజయవాడ చాప్టర్ నిర్వహించిన ఏపీ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ విజయవంతంగా జరిగింది. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, 1500 మంది వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడం, అవకాశాలను సృష్టించుకోవడం, వ్యాపార విస్తరణ తదితర అంశాల గురించి నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రతినిధులు ఆసక్తిగా పాల్గొన్నారు. ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ అన్నాదురై ప్రసంగం సదస్సుకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వినియోగదారుల సేవలు, వ్యాపార నిర్వహణలో నూతన విధానాల గురించి ఆయన చేసిన ప్రసంగం వాణిజ్యవేత్తలకు స్ఫూర్తినిచ్చింది. అంకితభావంతో కృషి చేస్తూ, వినూత్న విధానాలను అవలంభించడం ద్వారా వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నాదురై ఉద్బోధించారు. వ్యాపారవేత్తలు ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా పరస్పర వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. వ్యాపారుల మధ్య అనుబంధం బలపడితే, వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను సులువుగా అధిగమించగలుగుతారని అన్నాదురై వివరించారు. బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. పరస్పర సహకారంతో వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించామని, ఈ కాన్క్లేవ్ విజయవంతం కావడంతో తమ లక్ష్యం నెరవేరిందని అన్నారు. ఏ రంగంలోనైనా నెట్వర్కింగ్ కీలక భూమిక పోషిస్తుందని, వ్యాపార రంగంలోనూ నెట్వర్కింగ్ ను విస్తృతం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను ఆవిష్కరించవచ్చని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఒక్కచోటికి చేర్చి, వారి నడుమ సుహృద్భావ సంబంధాలను నెలకొల్పి, తద్వారా విస్తృత వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు బీఎన్ఐ ఏపీ కాన్క్లేవ్ అద్భుతమైన వేదికగా నిలిచిందని అన్నారు. సదస్సు ద్వారా ఆరంభమైన అనుబంధాలను కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రతినిధులందరినీ అనుసంధానించామని తెలియజేశారు. బీఎన్ఐ ఏపీ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ టైటిల్ స్పాన్సరుగా బీజ్ నెట్వర్క్, కో-స్పాన్సరుగా సార్క్స్ మీడియా, అసోసియేట్ స్పాన్సరుగా లెన్ ట్రీ వ్యవహరించారని వివరించారు. సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారందరికీ జై దేశాయ్, విశాల్ దేశాయ్ ధన్యవాదాలు తెలిపారు. బీఎన్ఐ ఏపీ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ చైర్మన్ త్రినాథ్ నండూరి, కన్వీనర్ యడ్ల పార్థసారధి, కోర్ కమిటీ సభ్యుడు తిరుమల కుటుంబరావు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *