ఏపీ ఇంధన పొదుపు పై జీఐజెడ్ జర్మనీ ఫోకస్

-మరోసారి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్
-ఏపీఎస్ఈసిఎం…ఇంధన సామర్థ్యానికి టార్చ్ బేరర్”—PwC సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రభాత్
-గత కొన్ని సంవత్సరాలుగా రూ.3800 కోట్ల విలువైన 5600 MU ఆదా చేయడంలో ఏపీఎస్ఈసిఎం కీలకమైన పాత్ర పోషించింది.
-ప్రభుత్వ శాఖలలో ఇంధన సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేయడానికి జీ ఓ జారీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
-ఏపీఎస్ఈసిఎం కేంద్రం నుండి రూ.50 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు గ్రాంట్లను పొందే అవకాశాన్ని అన్వేషిస్తోంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంధన పొదుపు , సామర్ధ్య కార్యక్రమాలలో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ అవార్డును పొంది , భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం .. నేడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది . ఇంధన పొదుపు, సామర్థ్యం , సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ముమ్మరంగా చేపట్టడం, ప్రధనాంగా పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు వంటి అంశాల పై కీలక రాష్ట్రాలు సాధించిన విజయాల పై జర్మనీ ప్రభుత్వానికి చెందిన జీఐజెడ్ అధ్యయనం చేస్తోంది. అందులో మరీ ముఖ్యంగా బీఈఈ సహకారంతో జిఐజెడ్ ఆంధ్ర ప్రదేశ్ పై ఈ అధ్యయనంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అధ్యయనం చేయడానికి జీఐజెడ్ ప్రముఖ కన్సల్టెన్సీ ప్రైస్ వాటర్ కూపర్స్ (పీడబ్ల్యుసి) ను నియమించింది. పీడబ్ల్యుసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రభాత్ నేతృత్వం లో ఒక బృందం గత రెండు రోజులుగా విజయవాడలో రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ అధికారులతో , నెడ్క్యాప్ అధికారులతో ఈ అధ్యయనం లో భాగంగా చర్చలు జరుపుతున్నారు.

జీఐజెడ్ జర్మనీ చేపట్టే అధ్యయనం పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర ముఖ్య రాష్ట్రాల చేపట్టిన ఇంధన సామర్థ్యా విధానాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్రం చేపట్టిన చర్యలను అర్థం చేసుకోవడం, అలాగే ఇతర రాష్ట్రాల్లో తగిన విధానాల అభివృద్ధి లో మద్దతునివ్వడం లక్ష్యంగా జీఐజెడ్ ఈ అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనం “పరిశ్రమలలో ఇంధన సామర్థ్యం” కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలలో (స్టీల్) ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బీఈఈ, జీఐజెడ్ సంయుక్తంగా ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

ఆంధ్రప్రదేశ్లో అధ్యయనాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన బీఈఈ, జీఐజెడ్ జర్మనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆర్థిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కు మరియు రాష్ట్రంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ను కొంత మేర అందుకునేందుకు ఇంధన సామర్థ్యం దోహదపడుతుంది. ఇది అంతిమంగా విద్యుత్ వినియోగదారులకు 24×7 నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరాను అందించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిల లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.

ఈ అధ్యయనాన్ని నిర్వహించడం కోసం BEE, GoI ద్వారా GIZ జర్మనీ చేత నియమించబడిన PwC యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రభాత్ విజయవాడను సందర్శించి, రాష్ట్ర ఇంధన సామర్థ్య కార్యకలాపాలు, విజయాలను విస్తృతంగా పరిశీలించారు. “AP ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, ఇంధన సంరక్షన విభాగాలు , ఐఓటీ టెక్నాలజీ , ఎనర్జీ ఎఫిసీఎంసీ పాలసీ , స్టాండ్ అలోన్ ఎస్డీఏ నమూనా, అవగాహన కార్యక్రమాలు మొదలైనటువంటివి చేపట్టిన ఏపీఎస్ఈసిఎం ప్రధాన కార్యక్రమాలతో మేము చాలా సంతోషంగా ఉన్నామని ప్రభాత్ తెలిపారు .

ఏపీఎస్ఈసిఎం రాష్ట్ర ప్రభుత్వానికి “ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పాలసీ”ని ప్రతిపాదించనుంది. ఈ పాలసీ ద్వారా మొత్తం వార్షిక ఇంధన డిమాండ్ దాదాపు 65830 మిలియన్ యూనిట్లలో రూ.11779 కోట్ల విలువైన సుమారు 16875 మిలియన్ యూనిట్లు (25.6 శాతం) ఆదా చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని యోచిస్తోంది . తద్వారా దాదాపు 14.34 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా.

ఏపీఎస్ఈసిఎం గత కొన్ని సంవత్సరాలుగా రూ.3800 కోట్ల విలువైన 5600 మిలియన్ యూనిట్లను వివిధ సెక్టార్లలో ఆదా చేయడంలో కీలక పాత్ర పోషించింది . ఏపీఎస్ఈసిఎం ఉత్తమ పద్ధతులను గుర్తిస్తూ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ అన్ని రాష్ట్రాలకు ఆంధ్ర ప్రదేశ్ స్టాండలోన్ ఎస్డీఏ మోడల్ అనుసరించాలని లేఖ రాశారు.

అన్ని ప్రభుత్వ విభాగాలలో ఇంధన సంరక్షణ (ఈసి) సెల్లను ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీ ఓ .ఆర్టీ .89 తేదీ .05-11-2020 జారీ చేసింది. మరియు ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడం కోసం ప్రభుత్వ విభాగాలలో ఇంధన పరిరక్షణ సెల్లను ఏర్పాటు చేయడానికి జీ .ఓ జారీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ . పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) స్కీమ్ అమలులో ఏపీఎస్ఈసిఎం అత్యుత్తమ స్టేట్ డేసిగ్నేటెడ్ ఏజెన్సీలలో ఒకటి. ఇది మొత్తం 5600 మిలియన్ యూనిట్ల పొదుపులో పారిశ్రామిక రంగంలో ఒక్క పాట్ ద్వారా రూ.2394 కోట్ల విలువైన దాదాపు 3430 MU ఆదా చేసింది. డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (DEEP) , సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి రూ 50 నుంచి రూ 100 కోట్లు గ్రాంట్లను పొందే అవకాశాన్ని కూడా ఏపీఎస్ఈసిఎం అన్వేషిస్తోంది.

ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు , విద్యుత్ వినియోగదారులతో సహా అందరిని భాగస్వాములుగా చేసి , ఇంధన పొదుపు , ఇంధన సామర్థ్య జీవన విధానాన్ని అనుసరించడానికి వారిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడం, ఆర్థిక కార్యకలాపాలను పెంచడం , పర్యావరణ ప్రయోజనాలతో పాటు ఇంధన వినియోగం మరియు విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూర్చే దిశగా ఏపీఎస్ఈసిఎం అడుగులు వేస్తోంది.

ఎనర్జీ కన్జర్వేషన్ – ఎనర్జీ ఎఫిషియెన్సీ పాలసీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంధన పొదుపు , సామర్ధ్య చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి మరియు వివిధ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.ఈ పాలసీ గృహ , పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయం, మున్సిపాలిటీ మరియు రవాణా రంగాలకు సంబంధించి రాష్ట్రంలో ఇంధన సామర్థ్యం, ఇంధన సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఉద్దేశించబడింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *