తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మొదటి విడతగా 200 గ్రామాలకు చెందిన విలేజ్ సర్వేయర్లకు/ వీఆర్వోలకు క్షేత్రస్థాయిలో సర్వే చేయుటకు వినియోగించే కిట్లను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జెసి డికే బాలాజీ, ఆర్డీఓ కనక నరస రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తో కలసి రీసర్వే కిట్లను విలేజ్ సర్వేయర్లు/ వీఆర్వో లకు పంపిణీ చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో రీ సర్వే కిట్లని పంపిణీ చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ కిట్ లో రీ సర్వే కు ఉపయోగపడే సుమారు 2500 రూపాయల విలువచేసే ఉపకరణాలు బ్యాగు, మెడికల్ కిట్టు, బూట్లు, వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్, బుక్ తదితరాలు మొదటి విడతగా 200 మంది కి పంపిణీ చేస్తున్నామని వీటిని రీ సర్వే విధులకు హాజరయ్యే విలేజ్ సర్వేయర్లు వీఆర్వోల సౌకర్యార్థం వీటిని వినియోగించుకోవాలని తెలిపారు. రీ సర్వే పూర్తి అయిన భూములలో హద్దురాళ్ళను నాటడం వేగవంతం చేయాలని సర్వే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వే డిపార్ట్మెంట్ అధికారులు సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News