22, 23 (బుధ, గురువారాల్లో) తేదీల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా, ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్స్ పనుల కోసం ఈ నెల 22, 23 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్.ఎల్.ఆర్.కు త్రాగునీరు సరఫరా ప్రస్తుతం 800 ఎం.ఎం.డయా పి.ఎస్.సి.పైప్ లైన్ ద్వారా జరుగుతుందని, దాని స్థానంలో మెరుగైన త్రాగునీరు అందించేందుకు 900 ఎం.ఎం.డయా పైప్ లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, అందులో భాగంగా సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద, హెచ్.ఎల్.ఆర్. కాంపౌండ్ వద్ద పాత లైన్ నుండి నూతన లైన్ కు ఇంటర్ కనెక్షన్ పనులు 22 వ తేదీ (బుధవారం) ఉదయం సరఫరా తర్వాత ప్రారంభించి 23వ తేదీ (గురువారం) సాయంత్రానికి పూర్తీ చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని తెలిపారు.
పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనుల వలన నగరంలోని లక్ష్మీపురం, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, ఏటి అగ్రహారం, మార్కెట్ యార్డ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కోర్ట్ కాంపౌండ్, కెవిపి కాలనీ, వికాస్ నగర్, శ్యామల నగర్, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాల బీడు, వసంతరాయపురం, శారదా కాలనీ రిజర్వాయర్ల ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు పూర్తిగా త్రాగునీటి సరఫరా నిలిపివేయబడుతుందని, శుక్రవారం (24వ తేదీ) ఉదయం నుండి త్రాగునీటి సరఫరా యధావిదిగా జరుగుతుందని, నగర ప్రజలు సదరు అంశాన్ని గమనించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *