Breaking News

టీడీపీతో కలిసి ఆలయాలను కూల్చిన బీజేపీకి హిందువులపై ప్రేమ ఉన్నట్లా..?

-వైఎస్సార్ సీపీ ట్వీట్ లో తప్పేముంది..?
-తెలుగు రాని గాడిదలు సునీల్ దియోధర్, సోము వీర్రాజు
-గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు మతపరమైన రాజకీయాలకు బీజేపీ తెరదీస్తోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సోమవారం 58 వ డివిజన్ 258 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆరో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శుభోదయ స్కూల్ రోడ్డు, జెండా చెట్టు సెంటర్, షాదీఖానా పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి.. 245 గడపలను సందర్శించారు. చంద్రబాబు లాగా అబద్దపు వాగ్దానాలతో పేదలను మోసపుచ్చడం తమకు తెలియదని మల్లాది విష్ణు అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి అమలు చేశామా..? లేదా..? అని అడిగిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. కనుకనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించి.. పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్ర
తెలుగు రాని గాడిదలు సునీల్ దియోధర్, సోము వీర్రాజు రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ను సునీల్ దియోధర్, సోము వీర్రాజు తప్పుపట్టడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే శివారాధన అని చెబుతూ.. వైసీపీ చేసిన ట్వీట్ లో తప్పేముందని ప్రశ్నించారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని కూడా మత రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉండగా టీడీపీతో కలిసి దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చిన మీకు హిందువుల పట్ల ప్రేమ ఉన్నట్లా..? చంద్రబాబు బూట్లతో పూజలు నిర్వహించినప్పుడు.. దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసినప్పుడు హిందూ ధర్మం గుర్తుకురాలేదా..? చెత్త తరలించే వాహనాలలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లిన దారుణ సంఘటనలు చోటు చేసుకుంది టీడీపీ, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలో కాదా..? సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీకి చెందిన వ్యక్తి దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న 2014-19 మధ్యకాలంలో దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి కనీసం నిధులు కూడా కేటాయించలేకపోయారని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధికి రూ. 80 కోట్ల నిధులను జమ చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయవలసింది పోయి.. ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సరికాదని మల్లాది విష్ణు అన్నారు. కనీసం ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఉన్న అవగాహన కూడా బీజేపీ నేతలకు లేకపోవడం బాధాకరమన్నారు. కన్నా లాంటి నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో సోము వీర్రాజుకి మతిభ్రమించినట్లు ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ మతాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని.. దేవాలయాల ప్రతిష్టను, హిందు ధర్మాన్ని ఎల్లవేళలా పరిరక్షిస్తున్నట్లు మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాలన్నింటినీ పునర్నిర్మిస్తున్నారని వెల్లడించారు. పీఠాధిపతులు, మఠాధిపతుల విలువైన సలహాలు, సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నట్లు వివరించారు. కనుక మతపరమైన రాజకీయాలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయవద్దని బీజేపీ నేతలను సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ రేటింగ్ గుండు సున్నా.. ఇటువంటి చర్యలతో అధ: పాతాళానికి పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, తోపుల వరలక్ష్మి, రహీం, వలి, జాన్ బాబు, క్రాంతి, నేరెళ్ల శివ, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి మరో ముందడుగు

-ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యమే లక్ష్యం – రూ.22లక్షల నూతన Fully Automated ImmunoAssyAnalyzerప్రారంభం -ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లే అవసరం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *