విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గడపగడపలో సంతోషాల
హరివిల్లు కురుస్తుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్లో, 107 సచివాలయం పరిధిలో ని కృష్ణలంక సుబ్రయనగర్ స్ట్రీట్ నుండి మొదలై
బీచ్ రోడ్, లాల్ బహదూర్ స్ట్రీట్, ఓరుసు వెంకటయ్య వీధి, పోలీస్ రామయ్య వీధి ప్రాంతాలలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి* జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వలంటీర్ వ్యవస్థ లను ప్రవేశపెట్టి కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని అన్నారు.రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ విప్లవం మొదలుపెట్టారని అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 95 శాతం పైగా హామీలు అమలు చేయడంతో పాటు,ఎన్నికల మెనిఫెస్టో లో లేని ఎన్నో పధకాలు ఆచరణలో పెట్టారని కొనియాడారు. గడపగడపకు వస్తున్న వైస్సార్సీపీ నాయకులకు బ్రమ్మరథం పడుతున్న ప్రజల స్పందన చూస్తుంటేనే ప్రభుత్వం పట్ల వారు ఎంత సంతృప్తి గా ఉన్నారో అర్థం అవుతోంది అని అన్నారు. జన్మభూమి కమిటీల మాదిరిగానే వాలంటీర్ల వ్యవస్థ కూడా ఉంటుందని వారంతా భావించినట్టు ఉన్నారు. దానికి భిన్నంగా సేవే పరమావధిగా పనిచేస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు. మొదట్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని చులకనగా చూసి వారి విధులను తులనడిన తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు ప్రజలలో వారికున్న ఆదరణ చూసి మాట మార్చి ఇప్పుడు మద్దతు గా మాట్లాడటం మా ఎస్సార్సీపి ప్రభుత్వ పని తీరుకి పనితీరు కు నిదర్శనం అని అన్నారు. కేవలం మూడేళ్ళ కాలంలోనే ఈ ప్రాంత వాసుల కష్టాలు తిరేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడంతో పాటు, మూడోదశ పనులు కూడా మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు పుప్పాల రాజా,టి,పి రెడ్డి,మద్దెల పవన్,గోగు గౌరీ,మెడ రమేష్,మూలం రెడ్డి సుబ్బారెడ్డి,సుంకర పెద్దబ్బాయి మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News