-రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం వేదికగా
-తొలిరోజు శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ గ్రూప్, హైదరాబాద్, తెలంగాణ వారిచే “భక్త ప్రహ్లాద” నాటక ప్రదర్శన
-రెండవ రోజు సోమవారం అస్థిత్వ థియేటర్ గ్రూప్, మంగుళూరు, కర్ణాటక వారిచే “కొండోనియన్స్” నాటకం.
-ముఖ్య అతిథిగా స్కూల్ ఆఫ్ డ్రామా & అఫైర్స్ సంచాలకులు అభిలాష్ పిళ్ళై
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ నాటక రంగ ప్రాశస్త్యాన్ని నేటి ఆధునిక కాలంలో ప్రపంచానికి పరిచయం చేస్తూ తన ప్రాభవాన్ని చాటుతున్న నెషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం లో ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు స్కూల్ ఆఫ్ డ్రామా & అఫైర్స్ సంచాలకులు అభిలాష్ పిళ్ళై పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రం వేదికపై తొలిరోజు “భక్త ప్రహ్లాద” నాటక ప్రదర్శన కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిలాష్ పిళ్ళై మాట్లాడుతూ, 22 వ భారత్ రంగ్ మహోత్సవ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయలను ప్రపంచానికి తెలియ చెయ్యడం లో నాటక రంగం ప్రదర్శనకి ఎంతో ప్రముఖమైన పాత్ర పోషించయనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. నాటక రంగం కు పూర్వ వైభవం తీసుకుని వచ్చే క్రమంలో భారత ప్రభుత్వం ఎంతో చేయూత ను నివ్వడం జరుగుతోందని, ఇందుకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ముందుండి ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా మార్పులకు నాంది పలుకుతూ యువతను ఆకర్షించే ప్రయత్నం చెయ్యడం జరుగుతున్నట్లు అభిలాష్ పిళ్ళై అన్నారు. ఈరంగంలో ఉన్న సంఘటిత, అసంఘిటిత కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చి, వారిలో నైపుణ్యానికి మెరుగులు దిద్దే పనిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చేస్తున్న ప్రయత్నం ద్వారా ప్రేక్షకులు తిరిగి స్టేజ్ నాటకాలు నాటికలు చేసే పరిస్థితు లను కలుగ చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. దేశంలో 9 నగరాల్లో శాఖలను ఏర్పాటు చేశారని అన్నారు. న్యూ ఢిల్లీ, జైపూర్, రాజమహేంద్రవరం, రాంచీ, గోహతి, జమ్ము, శ్రీనగర్, పొక్రాన్, నాసిక్ లలో ప్రాంతీయ కార్యాలయా లు ఏర్పాటు చేసి తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మన దేశ సంస్కృతి ను ప్రపంచానికి చాటడం కోసం భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ చేస్తున్న ప్రయత్నం సర్వదా స్వాగతీయమనీ అన్నారు.
19 ఫిబ్రవరి న శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ గ్రూప్, హైదరాబాద్, తెలంగాణ వారిచే “భక్త ప్రహ్లాద” నాటకం.
నాటక కథా సారాంశం:
స్తంభంలో శ్రీహరిని చూపించమన్నందుకు స్తంభాన్ని బ్రద్దలు కొట్టుకుంటూ వెలువడిన శ్రీమహావిష్ణువు నరసింహావతారం హిరణ్యకశిపుని సంహరించటం- భక్త ప్రహ్లాద నాటక ఇతివృతం ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.
రెండవ రోజు ఫిబ్రవరి 20 సోమవారం అస్థిత్వ థియేటర్ గ్రూప్, మంగుళూరు, కర్ణాటక వారిచే “కొండోనియన్స్” నాటకం ప్రదర్శించ నున్నారు.
కార్యక్రమంలో రాజమహేంద్రవరం సెంటర్ ఇన్చార్జ్ భూపతి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం, డిప్యూటీ డిఈఓ దిలీప్ కుమార్, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News