ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జగనన్న కి చెబుదాం పోర్టల్

-అర్హులకు పథకాలు అమలు చేయడం సిఎం లక్ష్యం
-1902 లో వొచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
-సిఎం ప్రతి అర్జి పరిష్కారం పై ప్రజలకు వివరాలు తెలియచేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు
-కె. దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు  15 అర్జీలు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు.

సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో  అదనపు డిప్యూటీ కమిషనర్  పి ఎం సత్య వేణి, ముఖ్య పట్టణ ప్లానింగ్ అధికారి జె.సూరజ్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్  జి.పాండు రంగారావు, ఇతర  అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన అర్జిల పరిష్కారం వివరాలు ఐ వి ఆర్ ఎస్ ద్వారా సిఎం మాటల్లో ప్రజలకు వివరించడం జే కే సీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అర్జిల పరిష్కారం కోసం ప్రజల సంతృప్తి స్థాయి కి ప్రాధాన్యత కలిగించే దిశలో ఎన్నో ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సమస్య నేరుగా సిఎం కు చెప్పుకునే అవకాశం సాధ్యం కానందున 1902 టోల్ ఫ్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు చేరువ చేసే ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. అర్జీలను నాణ్యత కలిగిన పరిష్కారం కోసం జిల్లా స్థాయి లో ప్రత్యేక ఆడిట్ టీమ్ పనిచెయ్యడం ఇందులో భాగంగా దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈవిధనం జిల్లా, రాష్ట్ర, ముఖ్యమంత్రి స్థాయి లో మూడు దశల్లో గా యాదృచ్ఛికంగా అర్జీలను ఎంపిక చేసి పరిష్కారం వివరాలు తెలుసుకోవడం జరుగుతోందని అన్నారు. ఆ మేరకు అర్జి పరిష్కారం పూర్తి జవాబుదారీతనం ఉండటం ముఖ్యం అన్నారు. అపరిష్కృతంగా ఉన్న వాటి సహేతుకమైన కారణం ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుందని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *