Breaking News

స్పందనకు వొచ్చిన అర్జీలు.. 149

-ప్రతి కార్యాలయంలో స్పందన కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసి బాధ్యత గల అధికారిని నియమించాలి
-అర్జీలను 24 గంటల లోపు ఓపెన్ చేసి చూడాలి.
-అర్జీ దారులకు నాణ్యతతో కూడిన పరిష్కార పత్రాన్ని అందించాలి.
-అర్జీలు రీ ఓపెన్ కు తావు లేకుండా నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలి.
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పూర్తిస్థాయిలో పరిష్కరించి అర్జీ దారునికి సత్వర న్యాయం చేసే విధంగా జిల్లా స్థాయి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత డిఆర్ఓ జి. నరసింహులు తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా ఆయా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు అందరూ ఆయా శాఖల వారి స్పందనలో వచ్చిన అర్జీలను వారం చివర రోజున తప్పనిసరిగా పరిష్కారం చూపాలని అన్నారు ప్రతిరోజు, అర్జీ వచ్చిన 24 గంటల లోపు వెబ్ సైట్ ఓపెన్ చేసి అర్జీని పరిష్కరించేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రతి కార్యాలయంలో స్పందన కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతగల అధికారులను నియమించాలన్నారు. భూ సమస్యలకు సంబంధించి ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.

జే కే సి వెబ్ పోర్టల్ కు సంబంధించి బుధవారం స్పందన వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ మాధవీ లత పేర్కొన్నారు. అందుకు గాను అధికారులు స్పందన అర్జీలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు.

ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ ప్రతి ఒక్క ఉద్యోగి నమోదు చేయాలని, ఏ మాత్రం కార్యాలయం పరిధిలో పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఇబ్బందులు ఏమైనా సంబంధిత అధికారుల శాఖ పరంగా ఉత్తర ప్రత్యుత్తరాలు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలో సచివాలయ పరిధిలో పనిచేస్తున్న పర్సన్, డిజిటల్ అసిస్టెంట్, కార్యదర్శులు, ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది కి ఇంతవరకు ప్రొహిబీషన్ డిక్లేర్ కాని వారు ఎవరైనా ఉంటే ఆయా కారణాలు తెలియజేస్తూ సీసీఎల్ రూల్స్ ప్రకారం నివేదిక పంపాలని స్పష్టం చేశారు. ఈరోజు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 149 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు.

స్పందనలో వొచ్చిన అర్జీలు:
రాజమహేంద్రవరం ఆకులవారి వీధి నివాసి ముత్యాల శ్రావణి నాధ్ తన అర్జీలో దివ్యాంగుడైన తనకు సదరన్ ద్వారా సర్టిఫికెట్ ఉందని ట్రై సైకిల్ మంజూరు చేయాలనీ కోరారు.ఈ అంశం పై కలక్టర్ స్పందిస్తూ వెంటనే వారికి ట్రై సైకిల్ అందించాలని విభిన్న ప్రతిభ వంతులని శాఖ ఏ డి కామరాజును ఆదేశించారు.

రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన చింతలపూడి పోతురాజు వారి అర్జీలో బలభద్రపురం లో వున్న గ్రాసిమ్ ఇండస్ట్రీ పై పర్యావరణ ఇంజనీర్ వారిచే జరుగు పర్యావరణ సమతుల్యత పై ప్రజాభిప్రాయ సేకరణ కు సంబంధించి నల్లమిల్లి గ్రామంలో దండోరా, నోటీస్ గాని ఇప్పటి వరకు ప్రజలకు తెలియపర్చలేదని అర్జి సమర్పించారు. కావున ఫిబ్రవరి 28న జరగాల్సిన ప్రజాబిప్రాయ సేకరణను వాయిదా వేయవలసిందిగా కోరారు.

నల్లజర్ల మండలం నబీపేట నివాసి తమ అర్జీలో వల్లపరపు సత్యనారాయణ వారి అర్జీలో తనకు ఒక కుమార్తె ఒక కుమారుడు వున్నారని, వీరిరువురికి వివాహం చేసామని, అయితే తన కుమారుడు తనకున్న 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నన్ను నా భార్యను చూడడం లేదని వృద్దాప్యం లో వున్న మాకు న్యాయం చేయాలనీ కోరారు. కలెక్టర్ స్పందిస్తూ కొవ్వూరు ఆర్డీఓ కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యను పరిష్కరించి నివేదిక సమరించాలని ఆదేశించారు.

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం నివాసి కే. ప్రమీల తమ అర్జీలో తన భర్త చనిపోయినందున తమ పిల్లల పోషణ నిమిత్తం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయాలని, తద్వారా ఏదైనా వ్యాపారం చేస్తూ తన పిల్లలను పోషించుకుంటానని ఆమె తన అర్జీలో కోరారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ డి ఆర్ డి ఏ అధికారికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమము లో డీఆర్వో  జి.  నరశింహు లు, ఆర్డీఓ ఏ. చైత్రవర్షిణి, డిసిహెచ్ఒ డా.ఎమ్.సనత్ కుమారి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా. ఎన్. వసుందర, సీపీఓ కె.ప్రకాష్ రావు,   డీ పి వో  పి. జగదాంబ,   పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవింద్, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, హోసింగ్ పి డి జి. పరశురామ్, ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి కే. జ్యోతి, డి ఎస్ ఒ పి. ప్రసాదరావు, డిఎల్డిఒ పి. వీణా దేవి, ఆర్డబ్యూ ఎస్. ఈ డి.బాల. శంకర్ రావు, పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఏవిబి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, ఆర్టీఒ కే వి.కృష్ణారావు, డిఆర్డిఏ  పిడి ఎస్.  సుభాషిణి,  డి హెచ్ వో వి.రాధాకృష్ణ, డిజైబుల్ శాఖ ఏ డి. వి. కామరాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును పరిరక్షించుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నోటీసులు అందిన ఓటర్లు మీ ఓటును …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *