పి సి పి ఎన్ డి టి యాక్ట్ పై బాలికల్లో అవగాహన ప్రశంసనీయం

-ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (సెక్స్ సెలక్షన్ నిషేధం) ప్రతి ఒక్కరికీ తెలియాలి
-పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులను అభినందించిన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24వ తేదీన నిర్వహించుకున్న  కార్యక్రమానికి సంబంధించి పోటీల్లో గెలుపొందిన విజేత విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు మెరిట్ సర్టిఫికెట్ అందచెయ్యడం ద్వారా వారి ప్రతిభకు పురస్కారం ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్లో పిసిపిఎన్డిటి యాక్ట్ అమలులో భాగంగా జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని జనవరి 24 న నిర్వహించిన పోటీల్లో బాలికల భాగస్వామ్యం అభినందనీయం అని, వారిలోని సృజనాత్మకతను, సమాజం పట్ల బాధ్యత, చట్టాలపై అవగాహన తనను ఎంతో ఆనందానికి గురిచేసిందని అన్నారు.

సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు హై స్కూల్ విద్యార్థులకు జిల్లాలో వ్యాసరచన వ్యక్తత్వ మరియు చిత్రలేఖన పోటీల్లో విజేతలుగా నిలిచిన ప్రధమ, ద్వితీయ తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు క్యాష్ అవార్డులను, ప్రశంసా పత్రములను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. కే మాధవీ లత మాట్లాడుతూ , ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (సెక్స్ సెలక్షన్ నిషేధం) ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముఖ్యంగా విద్యార్థులు, యువత లో అవగాహన అవసరం అన్నారు.
ఆడపిల్లల జీవన స్థితిని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని అవగాహన చేసుకుని ప్రయోజనం పొందాలన్నారు. ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఆడపిల్లలకు కొత్త అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అన్ని అసమానతలను తొలగించడంకోసం వారి హక్కులు, గౌరవం, విలువను పొందేలా చేయడం, లింగ వివక్షపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని, ఆ ప్రక్రియలో భాగంగా ఈ పోటీల నిర్వహణ జరిగిందని పేర్కొన్నారు.

జాతీయ బాలికా దినోత్సవం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు..

వ్యాసరచన పోటీల్లో మొదట బహుమతి పొందిన వారికి ఆరువేల రూపాయలు నగదు బహుమతి ఆర్ శాంత కుమారి జడ్పీహెచ్ఎస్ స్కూల్ మల్లవరం గోకవరం మండలం నుంచి పొందడం జరిగింది.

రెండవ బహుమతిగా ఎన్ పవన్ కుమార్ ఎస్ ఎన్ ఎం సి హెచ్ స్కూల్ రాజమహేంద్రవరం వారికి 3000 క్యాష్ అవార్డు మరియు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది.

మూడవ విజేతగా ఎం నవ్య జడ్పీహెచ్ఎస్ విధులపల్లి సీతానగరం మండలం వారికి 2000 క్యాష్ బహుమతి మరియు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా వ్యక్తిత్వ పోటీలు నిర్వహించి వరుసగా ప్రథమ స్థానం కె గీతాంజలి ఎస్ ఎన్ ఎం సి హెచ్ స్కూల్ 6000 రూపాయలను ప్రసంసా పత్రమును ఇవ్వడం జరిగింది.

ద్వితీయ స్థానంలో కే జ్యోతిర్మయి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ లాలాచెరువు వారికి మూడు వేలు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది.

మూడవ స్థానంలో పి శ్రీవల్లి జెడ్పిహెచ్ఎస్ ప్రభాకర్ నగర్ సీతానగరం మండలం వారికి 2000 క్యాష్ బహుమతి మరియు ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా చిత్రలేఖన పోటీలలో మొదటి స్థానముగా ఎస్ దినేష్ మున్సిపల్ హైస్కూల్ హై స్కూల్ లాలాచెరువు నుండి 6000 రూపాయలు నగదు బహుమతి ప్రశంసా పత్రం ఇవ్వటం జరిగింది.

ద్వితీయ బహుమతిగా కే ప్రవల్లిక ఎస్ కే వై టి గవర్నమెంట్ హై స్కూల్, రాజమహేంద్రవరం వారికి 3000 నగదు బహుమతి మరియు ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది.

మూడవ బహుమతిగా కే భాగ్యలక్ష్మి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ రాజమహేంద్రవరం వారికి 2000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో డా. ఎన్ వసుంధర, డీఈవో ఎస్ అబ్రహం, డి ప్యూటీ డెమో ఎన్ సత్యకుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *