తలసీమియ బాధితురాలు మాధురి వైద్య సేవలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల మంజూరు

-ఆటో డ్రైవర్ రాజేష్, చందన భాను లు కలెక్టర్ ను కృతజ్ఞతలు వ్యక్తం చేశారు
-చిన్నారి మాధురికి ఆల్ ది బెస్ట్ చెప్పిన కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక శాటిలైట్ సిటీ లో నివాసం ఉండే ఆటో డ్రైవర్ రాజేష్ దంపతులు జనవరి 3 వ తేదీన ముఖ్యమంత్రి ని కలిసి తమ కుమార్తె సిహెచ్. మాధురి (5) తలసిమియ వ్యాధి చికిత్స కోసం అర్జీ ఇవ్వడం జరిగిందని, ఆమేరకు పూర్తి వైద్య చికిత్స నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలను నిరంతర అభ్యంతరం తెలియచేసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ మాధవీలత ను కలెక్టరేట్ ఛాంబర్ లో మాధురి తల్లితండ్రులు సిహెచ్. రాజేష్, చందన భాను లు కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత చిన్నారి మాధురికి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. వైద్య ఖర్చులు కోసం రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు అందులో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు, సిఎంఆర్ఎఫ్ కింద రూ.5 లక్షలు తో పాటు వైద్య చికిత్స అనంతరం మరో రెండు లక్షలు ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రతినెలా రూ.10 వేల ను పెన్షన్ సౌకర్యం కింద అందించడం జరుగుతొందని అన్నారు.

మాధురి తల్లి తండ్రులు రాజేష్, భానుల కృతజ్ఞతలు వారి మాటల్లో, జనవరి 3 వతేదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి, తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితి, అందుకు సిఎం స్పందించి నేనున్నా అని హామీ ఇవ్వడమే కాకుండా, కేవలం 40 రోజుల వ్యవధిలో మా కుమార్తె వైద్య ఖర్చులు కోసం రూ.15 లక్షలు ఇవ్వడం ఎంతో ఆనందం గా ఉందని అన్నారు. చిన్నారులు, ఆడపిల్లలు కష్టంలో ఉన్నా , ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసినా ఇంత త్వరగా మానవత్వం తో స్పందించే హృదయం జగనన్న కే దక్కినదని అన్నారు. మా కుమార్తె కు మెరుగైన వైద్య సేవలు కోసమే హైదరాబాద్ లోని సిటిజెన్ హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి, రూ.20 లక్షలు అయ్యే చికిత్స కోసం ఆసుపత్రి వర్గాలు రూ 15 లక్షల తో చేయించెలా ఒప్పించడం జరిగిందని పేర్కొన్నారు. తాము ముఖ్యమంత్రి ని కలిసిన రోజే జిల్లా కలెక్టర్ కే. మాధవీలత మా వివరాలు తెలుసుకుని, స్వయంగా పిలిపించుకుని తక్షణ ఆర్థిక సహాయం లక్ష రూపాయల చెక్కును అందచేశారని అన్నారు. నిజంగా ఇది కలా? నిజమా? అనే అనుభూతిలో ఉన్నామని, మావంటి నిరుపేదల తల్లిదండ్రుల బిడ్డలకు వొచ్చే వ్యాధుల చికిత్స చేయించుకోలేని వారికి అండగా జగనన్న ఉండడం పట్ల మాధురి తల్లిదండ్రుల ఆనందం వెలకట్టలేనిది. ఆడపిల్ల అంటే చాలు మరో అడుగు ముందుకు వేసి నేడు మాపిల్ల ప్రాణాలను కాపాడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“కంపెనీ Specific డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *