Breaking News

“ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం సోమవారం “ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం” సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె.ప్రత్యూష కుమారి పేర్కొన్నారు. సామాజిక, ఆర్ధిక అసమానత లను దూరం చేస్తూ అందరికీ సమాన అవకాశాలు అందేలా చూడడం ప్రభుత్వ బాధత్య అని, అలాంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తుందన్నారు. అర్హులైన వారు ఎలా వీటిని వినియోగించుకోవాలి అనే విషయాల పై అందరిలో అవగాహన కల్పించెందుకు ఈ సదస్సు నిర్వహింస్తుయిన్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె.ప్రత్యూష కుమారి అన్నారు. అర్హత కలిగి కూడా పథకాల లబ్ధి పొందలేని వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె తెలియజేశారు. ఉన్నత విద్యలు, వసతి గృహాలు, ఆహారం, వైద్యం తదితర అవకాశాలను అర్హులైన వారు పొందడం వారి హక్కు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం జిల్లా బి.సి.వెల్ఫేర్ ఆఫీసర్ పి.ఎస్.రమేశ్, రాజమహేంద్రవరం జిల్లా ఎస్‌టి వెల్ఫేర్ ఆఫీసర్ కె.ఎన్.జ్యోతి, కోనసీమ జిల్లా బి.సి. వెల్ఫరే ఆఫీసర్ వై.సాంబమూర్తి, కాకినాడ జిల్లా ఎస్‌టి వెల్ఫేర్ ఆఫీసర్ ఏ.విజయ శాంతి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ డి.సుభాష్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు, సెక్రెటరీలు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి మాస్టర్ ప్లాన్, గ్రామ రహదారుల ప్రణాళికపై వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో గ్రామసభల నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *