రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి ఒకటవ తేదీనాటికి రబీ సాగు దిగుబడి అనుగుణంగా ఆర్భికే ల పరిధిలో ఉండే కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.
ఇందులో భాగంగా రబీ లో ఈ పంట నమోదు, పౌర సరఫరాల, పశు సంవర్ధక, ఉద్యానవన, జలవనరుల శాఖ, మైక్రో ఇరిగేషన్ , రైతులతో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, వ్యవసాయ సలహా మండలి సమావేశం లో చర్చించిన అంశాలపై , రైతులు నుంచీ వొచ్చిన సూచనల మేరకు కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, సాగునీటి విడుదల చెయ్యడం తో పాటు, పండించిన ధాన్యం కొనుగోలు కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు సంబంధించి అర్భికే పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు వచ్చే పంట కు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. అందుకు అనుగుణంగా ఆయా కేంద్రాల వద్ద గన్ని బ్యాగులను ముందస్తుగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎరువులు, పురుగుల మందులు, సాగు నీటి ఇబ్బందులు లేకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కి ప్రాధాన్యత ఇవ్వడం లో శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే తేజా, జి. జనార్ధన రావు, ఆదర్శ రైతులు ఎం.నరసింహారావు, డి. రామకృష్ణ, పీ. శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఇతర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు డి ఎం (సి ఎస్) ఇంఛార్జి పి ప్రసాద్ రావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ (మైక్రో ఇరిగేషన్) ఎస్. రామ్ మోహన్, గ్రౌండ్ వాటర్ డి డి వై. శ్రీనివాస్, జెడి (మత్స్య) బ్రహ్మనందం ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News