-జిల్లా ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్‌్‌కు నియమితులైన కారణంగా ప్రభుత్వ పక్షానా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
స్థానిక ఎ కన్వెక్షన్ సెంటర్ నందు 21వ తేది మంగళవారం నిర్వహించనున్న గవర్నర్ వీడ్కోలు కార్యక్రమ ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా మాన్యశ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ పదవీకాలంలో ఎనలేని సేవలందించారని, ఆయన ఛత్తీస్‌గఢ్‌్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఎ కన్వెక్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వీడ్కోలు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారన్నారు. పలువురు న్యాయమూర్తులు, క్యాబ్‌నెట్ మంత్రులు, శాసన మండలి, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహదారులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరు అవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే న్యాయమూర్తులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికి వారికి కేటాయించిన సీట్లలో ఆశీనులయ్యేల చర్యలు తీసుకోవాలన్నారు. సభ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఎల్‌ఇడి స్కీన్‌ల ఏర్పాటు వంటి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అతిధులకు ఆతిథ్యం అందించేలా ప్రోటోకాల్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరారు.
ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిసిఎస్‌వో పి. కోమలిపద్మ, డిఐపిఆర్‌వో యం. సురేంద్రనాధ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఇఇ వివి సుధాకర్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News