విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ద పరిచి ఫలితాలలో ఈ ఏడాది జిల్లాను అగ్ర స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న మోడల్ పరీక్షల ప్రశ్నపత్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో విడుదల చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలను ఎదుర్కోనేలా విద్యార్థులను సన్నద్ద పరచాలని సూచించారు. విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపట్ల మరింత ప్రత్యేక శ్రద్ద పెట్టి పరీక్షలను ఎదుర్కొనేలా సిద్దం చేయాలన్నారు. పరీక్షల విధానన్ని ముందుగానే విద్యార్థులకు తెలియజేయడంతో పాటు ముందుగానే పరీక్షలలో విద్యార్థి నైపుణ్యాన్ని తెలుసుకునేలా ముందుస్తు పరీక్షలు నిర్వహించేందుకు మోడల్ పేపర్లను రూపొందించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఐక్యఉపాధ్యాయు ఫెడరేషన్ (యుటిఎఫ్) నాయుకులను అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
మోడల్ పేపర్ల విడుదల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ డిఇవో సి వి రేణుక,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యం సోమేశ్వరరావు, మహిళ కన్వీనర్ సిహెచ్ ప్రణీత, నగర కమిటీ సభ్యులు పి. బాలు, ఆదర్శ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News