విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో రాజకీయాలకు అతీతంగా విద్య, ఉపాధి, వైద్య సహాయం అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ట్రస్ట్ ఛైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కు చెందిన 8నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం 3 ఇస్త్రీ బండ్లు,4తోపుడు బండ్లు,1టిఫిన్ బండి ని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక నాయకులతో కలిసి అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్ లో నివసించే వీరు అద్దె బండ్లుతో ఇబ్బందులు పడుతున్నామని తమకు జీవనోపాధి కి సహాయం చేయాలని స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరగా వారు తక్షణమే ఆ విషయం అవినాష్ దృష్టికి తీసుకురాగా వారికి దాదాపు 1లక్ష 70వేల రూపాయల విలువ గల బండ్లు ట్రస్ట్ ద్వారా అందజేశారు
Prajavartha Online Telugu News