-దళిత వర్గాలకు న్యాయం చేసి అక్కున చేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..
-ఎస్‌సి కమీషన్ సభ్యులు సిహెచ్.అనంద ప్రకాష్, కె. పుల్లారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్‌సి సబ్‌ప్లాన్ నిధులు ఏమాత్రం దుర్వినియోగానికి గురి కావడంలేదని ఎస్‌సి వర్గాల సంక్షేమానికి గతం ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే కల్పిస్తున్నారని సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగంపై ఎటువంటి చర్చకైన సిద్దమని ఎస్‌సి కమీషన్ సభ్యులు సిహెచ్.అనంద ప్రకాష్, కె. పుల్లారావు అన్నారు.
ఎస్‌సి సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం పై ఎస్‌సి కమీషన్ సభ్యులు సిహెచ్.అనంద ప్రకాష్, కె. పుల్లారావు మంగళవారం స్వరాజ్య మైదానంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్‌సి కమీషన్ సభ్యులు మాట్లాడుతూ సబ్‌ప్లాన్ విధులు దుర్వినియోగం అవుతున్నాయని ఇటీవల ప్రతి పక్షాలకు చెందిన కొందరు స్వార్థ దళిత నాయకులు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్య దళితులలో ఐక్యతను దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నామన్నారు. ఇది దళితల సంక్షేమానికి అభివృద్ధికి విఘాతం అవుతుందని ఇటువంటి చర్యలను మానుకోవాలని దళిత సోదరులకు హితవుపలుకుతున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు సంక్షేమ పథకాలకు లక్ష 92 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే అందులో 53 వేల కోట్ల రూపాయలు దళిత వర్గాలకు కేటాయిండం దళితులపై ముఖ్యమంత్రికి ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ కోటా మించి దళిత వర్గాల యువతకు అవకాశం కల్పిస్తూ 35 వేల ఉద్యోగాలలో దళిత వర్గాలకు లబ్ది చేకూరడం జరిగిందన్నారు. రాజ్యాంగ పరమైన పదవులలో దళితులకు పెద్ద పీటవేసి సమాజంలో సామానత్వాన్ని కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీభాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి వెంటనే తన సహచర మంత్రి వర్గంలో ఐదుగురు బలహీన వర్గాలకి చెందిన వారిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం ఆయన దార్శినికతకు నిదర్శనమన్నారు. ఇటీవల శాసనమండలి సభ్యులుగా ఇద్దరు దళితులకు అవకాశం కల్పించారన్నారు. సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అన్నారు. గతంలో ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూర కొరకు కార్యాలయాల చుట్టూ తిరిగిన్నప్పటికి అరకొరకగా రుణాలను మంజూరు చేసేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎస్‌సి కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ప్రొక్కులైనర్స్, జెసిబిలు, ఇన్నోవా కార్లు, బస్సులను 70 శాతం సబ్బిడీపై అందింస్తున్నారన్నారు. 300 బస్సులను కొనుగోలు చేసి ఆర్‌టీసి అద్దె బస్సులుగా నడుపుకునేందుకు దళిత యువతకు అవకాశం కల్పించడం జరిగిందని ఇప్పటికే విజయవాడ బస్‌స్టేషన్ ద్వారా 150 బస్సులు దళిత వర్గానికి చెందిన వారు నడుపుతున్నారన్నారు. ఎస్‌సి కమీషన్ కార్యాలయానికి ప్రతి రోజు అనేక మంది ఎస్‌సి వర్గానికి చెందిన వారు న్యాయం కోసం వస్తున్నారని వారందరూ గత ప్రభుత్వ చర్యలవలన ఎదురైన ఇబ్బందుల పరిష్కారం కోసం వస్తున్నారన్నారు. ఎస్‌సి కమీషన్ దళితులపై దాడులను ఉపేక్షించబోదని చట్టం తన పని చేసుకుంటుందని దళితలకు ఎటువంటి అన్యాయం జరిగినా న్యాయం చేసేందుకు సిద్దంగా వుంటుందని కమీషన్ సభ్యులు సిహెచ్. అనంద ప్రకాష్, కె. పుల్లారావు తెలిపారు.
Prajavartha Online Telugu News