Breaking News

ప్రపంచ పర్యాటక కేంద్రంగా డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహ స్మృతి వనం

-శర వేగంగా పనులు డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి నాటికి ప్రారంభోత్సవానికి సిధ్ధం
-రాష్ట్ర ఎస్‌ సి కమీషన్‌ సభ్యులు సిహెచ్‌ ఆనంద ప్రకాష్‌, కె. పుల్లారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలకు జీవం పోసేవిధంగా అంబేద్కర్‌ విగ్రహాం స్మృతి వనం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రపంచ పర్యాటక కేంద్రంగా స్మృతి వనాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమని రాష్ట్ర ఎస్‌ సి కమీషన్‌ సభ్యులు సిహెచ్‌ ఆనంద ప్రకాష్‌, కె. పుల్లారావు అన్నారు.
నగరంలోని స్వరాజ్‌ మైదానంలో శరవేగంతో నిర్మిస్తున్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం స్మృతి వనం పనులను మంగళవారం రాష్ట్ర ఎస్‌ సి కమీషన్‌ సభ్యులు సిహెచ్‌ ఆనంద ప్రకాష్‌, కె. పుల్లారావులు సాంఫీుక సంక్షేమ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కమీషన్‌ సభ్యులు సిహెచ్‌ ఆనంద ప్రకాష్‌ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నడిబొడ్డున్న 125 అడుగుల డా. బి ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. డా. బిఆర్‌ అంబేద్కర్‌ ఏ ఒక్క కులానికి, మతానికి, వర్గానికి మాత్రమే సంబంధించిన వారనే అపోహలను తొలగిస్తూ అంబేద్కర్‌ అందరి వాడని నిరూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అంబేద్కర్‌ ఆశాయాలు ఆలోచన విధానాలు భావితారలు గుర్తించుకునేలా స్మృతి వనాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేది నాటికి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేసేందుకు అహర్నిసలు కృషి చేస్తున్న సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
కమిషన్‌ సభ్యులు కె. పుల్లారావు మాట్లాడుతూ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా దేశంలోనే అత్యంత భారీ విగ్రహాన్ని 268 కోట్ల రూపాయల నిధులతో స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేస్తున్న డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ భావితరాలకు స్మరించుకోవలనదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విగ్రహా నిర్మాణం సామాజిక స్మృహకు నిదర్శనమని పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇప్పటికే పెడస్ట్రల్‌ పనులు పూర్తి అయ్యాయని కన్వెన్షన్‌ పనులకు సంబందించి బేస్‌మెంట్‌, ప్లోరింగ్‌ పనులు పూర్తిచేశారన్నారు. ఏప్రిల్‌ 14వ తేది డా. బి ఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని కె. పుల్లారావు తెలిపారు.
డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ స్మృతి వనం పనుల పరిశీలనలో జిల్లా సాంఫీుక సంక్షేమ శాఖ అధికారిని బి.వి. విజయభారతి, దళిత నాయకులు బూదల శ్రీను, నలకుర్తి రమేష్‌, కాలే. వెంకటరమణరావు, లేళ్లపూడి లాజర్‌, కెసిపి ప్రాజెక్టు మేనేజర్‌ కృష్ణమోహన్‌ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కూటమి ప్రభుత్వ విజయాలు వివరించిన పట్టాభిరామ్

-ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పట్టాభిరామ్, ఎమ్మెల్యే గద్దె విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *