వలస వెళ్లిన వారి వివరాలను గుర్తించి నమోదు పూర్తి చెయ్యండి

-అయుష్మాన్ భారత్ పోర్టల్ లో నమోదు ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య భద్రత సాధ్యం
-డి ఎల్ డివో వీణా దేవి

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుష్మాన్ భారత్ కింద పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆరోగ్య పరిరక్షణ కోసం ఆధార్ ఈ కేవైసి తప్పనిసరిగా పూర్తి చెయ్యాలని రాజమండ్రి డివిజన్ డెవలప్మెంట్ అధికారి పి. వీణా దేవి స్పష్టం చేశారు.

మంగళవారం కోరుకొండ , గోకవరం మండలాలకు చెందిన ఆయుష్మాన్ భారత్ నమోదు ప్రక్రియపై సచివాలయ , ఏ ఎన్ ఎమ్, ఆరోగ్య సిబ్బందికి, కోరుకొండ ఎంపిడిఓ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డి ఎల్ డివో పి. వీణా దేవి మాట్లాడుతూ, మండలం పరిధిలో ఆయుష్ మాన్ భారత్ కింద పోర్టల్ అందుబాటులో ఉన్న కుటుంబాల యొక్క ఆధార్ అనుసంధానం, బయో మెట్రిక్ అధంటిఫికేషన్ ద్వారా నమోదు చెయ్యడం ద్వారా వారికి పూర్తి ఆరోగ్య భద్రత కల్పించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య భద్రత యోజన పథకం కింద ప్రజలకు రూ.5 లక్షల వరకు సంపూర్ణ ఆరోగ్య భద్రత సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.

కోరుకొండ మండలం లోని 24 గ్రామాల పరిధిలో 40,975 మంది డేటా కు గాను ప్రస్తుతం 27,728 మంది వివరాలు పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ఇప్పటి వరకు 21779 మంది వివరాలు సేకరించి ఈ కేవైసి చేశారని, ఇంకా అందుబాటులో ఉన్న 2407 మంది వివరాలు సత్వరం నమోదు చేసి, ఈ కేవైసి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వలస వెళ్లిన వారు 1113 మంది, మరణించిన వారు 1010 మంది, ఇతర సచివాలయంలో నమోదు అయిన వారు 49, ఆధార్ మీస్-మ్యాచ్ 640, కనపడని వారు 280 మంది వివరాలు ఉన్నట్లు తెలిపారు.

గోకవరం మండలం లోని 20 గ్రామాల పరిధిలో 35,813 మంది డేటా కు గాను ప్రస్తుతం 22,750 మంది వివరాలు పోర్టల్ లో  అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ఇప్పటి వరకు కేవలం 17,710 మంది వివరాలు సేకరించి ఈ కేవైసి చేశారన్నారు. ఇంకా అందుబాటులో ఉన్న 1516 మంది వివరాలు సత్వరం నమోదు చేసి, ఈ కేవైసి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. మండలంలో వలస వెళ్లిన వారు 1, 596 మరణించిన వారు 1111 మంది, ఇతర సచివాలయంలో నమోదు అయిన వారు 47, ఆధార్ మీస్-మ్యాచ్ 255, కనపడని వారు 515 మంది వివరాలు ఉన్నట్లు తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ – నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలు – రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (RSBY) మరియు సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (SCHIS)లను ఉపసంహరిస్తున్న దృష్ట్యా ఆయా కుటుంబాల వివరాల నమోదు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా ఆరోగ్య శ్రీ కో ఆర్దినేటర్ డా. పి.. ప్రియాంక పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఎంపీడీఓ లు నరేష్ కుమార్, ఎస్ ఎస్ శ్రీనివాస్, వైద్యాధికారులు, సచివాలయ డిజిటల్ సహయక కార్యదర్శులు, సంక్షేమ సహాయ కార్యదర్శులు, ఏ ఎన్ ఎం లు వాలంటీర్ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *