-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 259 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక న్యాయం అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దేశానికే రోల్ మోడల్ గా నిలిచారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మంగళవారం 58 వ డివిజన్ 259 వ వార్డు సచివాలయ పరిధిలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కృష్ణ హోటల్ సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి శుభోదయ స్కూల్ రోడ్డు వరకు కొనసాగించారు. 170 గడపలను సందర్శించి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక, అవినీతిరహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఏపీలో అమలవుతున్న బృహత్తర కార్యక్రమాలు దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు ద్వారా సంక్షేమ పథకాలను చిట్టచివరి వ్యక్తి వరకు అందజేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అడుగులు వేస్తూ.. ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం, గృహ సదుపాయం కల్పిస్తున్నారన్నారు. సెంట్రల్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా 4 అర్బన్ హెల్త్ సెంటర్లను ఒక్కొక్కటి రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అయోధ్యనగర్ లోని హెల్త్ సెంటర్ ను ఇప్పటికే ప్రారంభించుకోగా.. ఇందిరానాయక్ నగర్లోని ఆరోగ్య కేంద్రాన్ని ఈనెల 23న హోం మంత్రి చేతులమీదుగా ప్రారంభించుకోనున్నట్లు వెల్లడించారు.
గడప గడపకూ వెళ్లే ధైర్యం టీడీపీ నేతలకు ఉందా..?
తెలుగుదేశం హయాంలో ప్రజలకు ఇంత మేలు చేశామని గడప గడపకూ వెళ్లి చెప్పే ధైర్యం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఉందా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఎంతసేపూ ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇంత జవాబుదారీతనంగా ప్రజల ముందుకు వెళ్లి చెప్పిన సంఘటన గతంలో ఎప్పుడూ లేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను మాయం చేసిందని.. కానీ మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మల్లాది విష్ణు తెలిపారు. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడిందో ఇంటింటికి వెళ్లి చెబుతున్నామని.. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 వాగ్దానాలపై మాట్లాడే ధైర్యం పచ్చ చొక్కాలకు ఉందా..? అని ప్రశ్నించారు.
సామాజిక న్యాయం చేతల్లో చూపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సామాజిక విప్లవం కొనసాగుతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. మంత్రివర్గం కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల వరకు పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేయడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ చేతల్లో చూపారన్నారు. మరలా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించి మరోసారి చారిత్రాత్మక ప్రకటన చేశారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 18 మంది అభ్యర్థులలో 14 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత మూడున్నరేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని మేధావులు సైతం కీర్తిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తోన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలపై ప్రజలు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు కూడా ఎప్పుడూ ఇంతటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్రలేదన్నారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, తోపుల వరలక్ష్మి, మన్నెం అశోక్, క్రాంతి, బొందిలి శైలజా, వసంత్, వలి, నేరెళ్ల శివ, జాన్ బాబు, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News