-సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి బందోబస్తు ప్రణాళిక సిద్ధం కావాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.హరి నారాయణన్ మంగళవారం సాయంత్రం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం నుండి ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్, జే.సి. లు, డి.ఆర్.ఓ. లు, ఆర్.డి.ఓ లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా తిరుపతి నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె.వెంకటరమణా రెడ్డి, జే సి డి కే బాలాజీ, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు, ఆర్.డి.ఓ.లు కనకనరసా రెడ్డి, చంద్రముని రణాల్, రామారావు, కిరణ్ కుమార్, రిటైర్డ్ జే.సి. చంద్రమౌళి, ఎస్డిసి శ్రీనివాసులు, చెన్నయ్య తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ శాసన మండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ , స్థానిక సంస్థల మండలి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని విధాల ప్రణాళికా బద్దంగా పోలింగ్ స్టేషన్ లు, పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది ఎంపిక, మార్కడ్ ఓటర్ల జాబితా తయారీ తదితర ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని, జిల్లా రెవిన్యూ అధికారులను అసిస్టంట్ రిటర్నింగ్ అధికారులుగా గెజిట్ నోటిఫై చేసినందున పూర్తి భాద్యతతో సంబందిత ఆర్.డి.ఓ లను సమన్వయo చేసుకొని ముందుకెల్లాలని కోరారు. జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, కంప్లైంట్ రిజిస్టర్ ఉండాలని సూచించారు.
వి సి అనంతరం కలెక్టర్, జే సి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ డి.ఆర్.ఓ. లు, ఆర్.డి.ఓ. లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులు రెప్రెజంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నిబందనలను అర్థం చేసుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు. సేక్టోరియల్ అధికారులు వారికి కేటాయించిన రూటు, పోలింగ్ స్టేషన్ లను ముందస్తుగా పరిశీలించాలని పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు, బయట వీడియోగ్రఫీ కు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలనీ తెలిపారు.
ఎన్నికల నిబంధనల మేరకు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యుషన్ సెంటర్ల నుండి పోలింగ్ కేంద్రాలకు తరలించే మెటీరియల్ లను చెక్ లిస్టు ఆధారంగా పంపాల్సి ఉంటుందని అన్నారు. రిసెప్షన్, డిస్ట్రిబ్యుషన్ సెంటర్ల యందు లైటింగ్ ఏర్పాట్లు చూడాలని అన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు సిబ్బందికి మార్చి 1, 9 తేదీలలో రెండు సార్లు శిక్షణ ఇవ్వాలని ఈ శిక్షణ బాధ్యతలు రిటైర్డ్ జె.సి. వి.ఆర్. చంద్రమౌళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోదండ రామి రెడ్డి పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణ ఉండాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులను మరో సారి పరిశీలించి సక్రమంగా ఉండేలా చూడాలని అన్నారు.
జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి అనుగుణంగా ఆర్డీఓ లు సంబంధిత డిఎస్పీ లతో కలిసి బందోబస్తు ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు.
Prajavartha Online Telugu News