ఈనెల 23న ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ మాక్ ఎక్సర్‌సైజ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్డిఎంఏ) మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీఎస్డిఎం ఎ) సూచనల మేరకు రసాయన విపత్తుపై ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ మాక్ ఎక్సర్‌సైజ్ ఈనెల 23వ తేదీ గురువారం ఉదయం 9:00 గంటల నుండి జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం లోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF)తో పాటు ప్రధాన ప్రమాద కర్మాగారాలకు చెందిన రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సేవలు, వైద్య & ఆరోగ్యం మరియు పరస్పర సహాయ సభ్యులు ఈ మాక్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొంటారన్నారు. కర్మాగారాల్లో పూర్తిస్థాయిలో భద్రత ప్రమాణాలు అమలు చేయడం, ఏదైనా ప్రమాదం సంబంధించిన సందర్భంలో చేపట్టే చర్యలను వివరించే విధంగా నమూనా మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *