బైసాఖి మాసంలో భారత్ గౌరవ్ పర్యాటక రైలులో గురు కృపా యాత్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బైసాఖి మాసంలో భారత్ గౌరవ్ పర్యాటక రైలులో గురు కృపా యాత్రలో భాగంగా ప్రసిద్ధ సిక్కు పుణ్యక్షేత్రాలకు ప్రయాణించే గొప్ప అవకాశం
వివిధ గురుద్వారాలు, సిక్కు గురు సంద మరియు వివిధ సిక్కు సంఘాలతో జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ పర్యటనను ప్రత్యేకంగా రూపొందించారు .
11 రోజులు / 10 రాత్రుల అన్నిటితో కలిపి ఉన్న ఈ పర్యటన లక్నో నుండి 5 ఏప్రిల్, 2023న ప్రారంభమై 15 ఏప్రిల్, 2023న ముగుస్తుంది
ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని శ్రీ కేస్‌ఘర్ సాహిబ్ గురుద్వారా మరియు విరాసత్-ఎ-ఖల్సా, కిరాత్‌పూర్ సాహిబ్‌లోని గురుద్వారా శ్రీ పాతాల్‌పురి సాహిబ్, సిర్హింద్‌లోని గురుద్వారా శ్రీ ఫతేగర్ సాహిబ్, అమృత్‌సర్‌లోని శ్రీ అకల్ తఖ్త్ మరియు గోల్డెన్ టెంపుల్, శ్రీ దామ్‌దామ సఖ్‌దాబ్ వద్ద ఉన్న సిక్కు పవిత్ర స్థలాలను అలాగే నాందేడ్‌లోని శ్రీ హజూర్ సాహిబ్, బీదర్‌లోని గురుద్వారా శ్రీ గురునానక్ ఝీరా సాహిబ్ మరియు పాట్నాలోని గురుద్వారా శ్రీ హర్మాందర్జీ సాహిబ్వద్ద ఉన్న సిక్కు మత పవిత్ర స్థలాలను దర్శించవచ్చు.

ఈ ప్రత్యేక రైలులో 678 మంది భక్తులు ప్రయాణించవచ్చు
• ఐ ఆర్ సి టి సి ఏప్రిల్‌లో తన ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుతో గురు కృప యాత్రను నిర్వహిస్తుంది. ఇది బైసాకి మాసంలోను కలిసివచ్చే విదంగా ఉంటుంది.
• 9 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 1 ఏసి -3 టైర్ మరియు 1ఏసి – 2 టైర్ కోచ్, 1 ప్యాంట్రీ కారు, 2 జనరేటర్ కోచ్‌లతో కలిపి ఉంటుంది .
• ఐ ఆర్ సి టి సి 3 విధాలైన పర్యాటక ప్యాకేజీని అందిస్తోంది: స్టాండర్డ్, సుపీరియర్ మరియు కంఫర్ట్.
• ప్రయాణీకులు లక్నో, సీతాపూర్, పిలిభిత్ & బరేలీలో ఎక్కవచ్చు /దిగవచ్చ్చు
• ఈ పర్యాటక ప్యాకేజీల ధర వ్యక్తికి రూ.19,999/- నుండి ప్రారంభమవుతుంది.

భారతదేశం యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వాన్ని భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారాప్రోత్సహాన్ని కల్పిస్తోంది . ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవాన్నిగొప్పగా తెలియజేసేందుకు వివిధ ప్రసిద్ధ నేపథ్యం ఉన్న ప్రదేశాలలో రైల్వే సర్వీసులు నడుపుతున్నాయి.
సిక్కు మత విశ్వాసాలను భక్తితో ఆచరించే వారికోసం భారతీయ రైల్వే ప్రత్యేకంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలుతో గురు కృప యాత్రను వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తోంది. ఉత్తర భారతదేశంలో మొత్తం బైసాఖీ మాసంగా కూడా జరుపుకుంటారు. వివిధ స్థాయిలలోని సంబంధిత వర్గాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపుల తర్వాత, భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రాలకు పర్యటించేందుకు గాను ప్రత్యేకంగా ఈ పర్యటనను రూపొందించింది.
భారతీయ రైల్వేలు 11 రోజులు / 10 రాత్రుల అన్నిటితో కలిపి ఈ పర్యటనను లక్నో నుండి ఏప్రిల్ 5, 2023నప్రారంభమై 15 ఏప్రిల్, 2023న ముగుస్తుంది. ఈ అద్భుతమైన పవిత్ర పర్యటనలో యాత్రికులు సిక్కు మతానికి చెందిన అత్యంత ఆరాధ్య స్థలాలైన ఐదు పవిత్ర పీఠాలను సందర్శిస్తారు. .దేశంలోని సిక్కులకు సంబందించిన గొప్ప పుణ్యక్షేత్రాలను దర్శించడానికి గాను ఈ పర్యటన ప్రత్యేకంగా రూపొందించారు . ఈ పర్యటనలో ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని శ్రీ కేస్‌ఘర్ సాహిబ్ గురుద్వారా మరియు విరాసత్-ఎ-ఖల్సా, కిరాత్‌పూర్ సాహిబ్‌లోని గురుద్వారా శ్రీ పాతాల్‌పురి సాహిబ్, సిర్హింద్‌లోని గురుద్వారా శ్రీ ఫతేగర్ సాహిబ్, శ్రీ అకల్ తఖ్త్ మరియు అమృత్‌సర్, శ్రీ దామ్‌దామలోని గోల్డెన్ టెంపుల్, శ్రీ దామ్‌దామ వద్ద ఉన్నాయి. నాందేడ్‌లోని సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్, బీదర్‌లోని గురుద్వారా శ్రీ గురునానక్ ఝీరా సాహిబ్ మరియు పాట్నాలోని గురుద్వారా శ్రీ హర్మాందర్జీ సాహిబ్ వంటి పుణ్యక్షేత్రాలు వున్నాయి.

ఈ రైలును 9 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 1 ఏ సి -3 టైర్ మరియు 1 ఏ సి – 2టైర్ కోచ్‌తో ఐ ఆర్ సి టి సి నడపనుంది. ఈ పర్యాటక ప్యాకేజీని 3 కేటగిరీలలో ఐ ఆర్ సి టి సి అందిస్తోంది: స్టాండర్డ్, సుపీరియర్ మరియు కంఫర్ట్ మొత్తం సామర్థ్యంతో 678 మంది ప్రయాణికులు ( స్టాండర్డ్ విభాగంలో అన్ని విధాలైన బడ్జెట్ కేటగిరీలో ) అన్ని కలుపుకొని ఉన్న ఈ పర్యటన సమర్దవంతంగా రూపొందించబడిన ప్రత్యేకమైన కోచ్‌లలో సౌకర్యవంతమైన రైలు ప్రయాణం, పూర్తి ఆన్-బోర్డ్ & ఆఫ్-బోర్డ్ భోజనం, నాణ్యమైన హోటళ్లలో వసతి, సందర్శనా స్థలాలతో పాటు పూర్తి రహదారి బదిలీలు. టూర్ ఎస్కార్ట్‌ల సేవలు, ప్రయాణ బీమా, ఆన్-బోర్డ్ సేవలను కలిగి ఉంటుంది. భద్రత మరియు హౌస్ కీపింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

ప్రయాణ సమయంలో ముఖ్యమైన గురుద్వారాలలో అన్నదానంలో పాల్గొనే అవకాశం కూడా అందుబాటులో ఉంటుంది.

ఐ ఆర్ సి టి సి రైలులో సీట్ల సామర్ద్యాన్ని పెంచడం కోసం పర్యాటకులకు ఆకర్షణీయమైన రీతిలో పర్యాటకులకు అనుకూలమైన రీతిలో పర్యాటక ధరను నిర్ణయించింది. సుసంపన్నమైన ధార్మిక మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క మార్గంలో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రయాణించడానికి సిక్కు మతాన్ని ఆచరించే భక్తులను స్వాగతించడానికి భారతీయ రైల్వే సిద్ధంగా ఉంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *