Breaking News

ఎండియు ట్రక్ ఆపరేటర్స్ భర్తీకి దరఖాస్తు కు ఆహ్వానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వుల ప్రకారం గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో రైస్ కార్డు కలిగిన వారికి ఉచిత రేషన్, సరుకులు ప్రజల ఇళ్ళ వద్దకు సరఫరా చేయుటకు 3 మంది ఎండియు ట్రక్ ఆపరేటర్స్ భర్తీకి ఆసక్తి కల్గిన వారు దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో 88 మంది ఎండియు ట్రక్ ఆపరేటర్స్ ని గతంలో నోటిఫికేషన్ ద్వారా ఎంపిక చేయుట జరిగినదని, అందులో ముగ్గురు వివిధ కారణాలతో సదరు పోస్ట్ కి రాజీనామా చేశారని, గుంటూరు తూర్పు తహసిల్దార్ రిపోర్టు ఇచ్చారన్నారు. సదరు ఖాళీలను భర్తీచేయుటకు 5వ విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయవలసియున్నదని, 31 జనవరి 2023 నాటికి 21-45 ఏళ్లలోపు ఉండి, 7వ తరగతి ఉత్తీర్ణతై, నెలకు రూ.12 వేలు ఆదాయము కలిగి, డ్రైవింగ్ లైసెన్స్ జారీచేసిన తేదీ నుండి ప్రస్తుతమునకు 2 సంవత్సరములు పైబడియుండిన మైనారిటి మరియు క్రిస్టియన్ మైనార్టి అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తులు ఈ నెల 23 నుండి 27 వరకు గుంటూరు నగర పాలక సంస్ధ ప్రధాన కార్యాలయములోని ఉపాసెల్ విభాగంలో దరఖాస్తును అందజేసి రశీదు పొందవలసినదిగా తెలిపారు. దరఖాస్తుదారులు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగంగాని, ప్రభుత్వ పింఛను పొందుతున్న వారుగాని, స్వంతంగా లేక వ్యాపార నిమిత్తంగా 4 చక్రాల వాహనము కలిగిన వారుగాని మరియు ఆదాయపన్ను చెల్లించేవారు ఈ పధకమునకు అనర్హులు అని తెలిపారు. దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము మరియు రెండు సంవత్సరములు పైబడి జారీచేసిన డ్రైవింగ్ లైసెన్స్ లు జతచేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడం రాజకీయ పతనానికి నిదర్శనం

-16 వేలకుపైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన లోకేష్‌ను చూసి ఓర్వలేక విషప్రచారం -ఐదేళ్లలో డీఎస్సీ ఇవ్వలేని జగన్‌.. ఇప్పుడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *