-పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన కీలక సమయం.
-విజయవాడ నగరం లో పార్టీ ఇచ్చిన పదవికి భిన్నంగా పరిధి దాటి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే అధికారం పరిధి ఎవరికి లేవు.
-ఇచ్చిన పదవికి భిన్నంగా పరిధి దాటి పార్టీ భవిష్యత్తు ప్రయోజనాలను దెబ్బతీసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు రాజకీయాలలో మార్పు కోసం బాధ్యతాయుతంగా పనిచేసే యువతకు అవకాశాలు కల్పించడంతో పాటు, ఒక తరానికి అవకాశాలు కల్పిస్తూ మరొక తరానికి వారధిగా నిలవడం జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను నమ్మి మమేకమవుతున్న ప్రజలు లక్షలాదిమంది యువత పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు . జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో బలంగా నిర్మాణాన్ని రూపొందించుకుంటూ క్షేత్రస్థాయిలో బలపడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటం కోసం, వైయస్సార్సీపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిస్వార్ధంగా నిరంతరం కృషి చేస్తున్నారు. జనసేన పార్టీ లో ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతాయుతంగా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి సాధన కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాల్సినటువంటి కీలక తరుణం. విజయవాడ నగరంలో పార్టీ ఇచ్చిన పదవీ బాధ్యతలను ఎవరు పరిధిలో వారు నిర్వహించగలరు. అందుకు భిన్నంగా పరిధి దాటి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే అధికారం, పరిధి ఎవరికి లేవు . మూడు విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రస్తుత తరుణంలో పార్టీ ఆమోదం లేకుండా స్వయం ప్రకటిత నాయకులు సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుంటూ పార్టీని గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇచ్చిన పదవీ బాధ్యతలకు భిన్నంగా పరిధి దాటి పార్టీ భవిష్యత్తు ప్రయోజనాలను దెబ్బతీసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడును.
Prajavartha Online Telugu News