నగర ప్రజలకు మెరుగైన త్రాగునీరు అందించడానికి చర్యలు

-పైప్ లైన్ మరమత్తులు, ఇంటర్ కనెక్షన్ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తీ
-శుక్రవారం నుండి యధావిధిగా సరఫరా
-పనులను బుధవారం పరిశీలించిన కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు మెరుగైన త్రాగునీరు అందించేందుకు, రానున్న వేసవిలోపే పైప్ లైన్ల మీద ఏర్పడిన లీకుల మరమత్తులను పూర్తీ చేసేలా ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ సంజీవయ్య నగర్ రైల్వే క్రాసింగ్ గేటు వద్ద, అరండల్ పేట హెచ్.ఎల్.ఆర్. వద్ద జరుగుతున్న ఇంటర్ కనెక్షన్ పనులను తనిఖీ చేసి, పనుల వేగవంతం పై ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్.ఎల్.ఆర్. ప్రస్తుతం ఉన్న 800 డయా పైప్ లైన్ స్థానంలో ఏర్పాటు చేసిన 900 డయా పైప్ లైన్ అనుసంధాన పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని, ఇంజినీరింగ్ అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, పనుల ప్రాంతంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనుసంధాన, లీకుల మరమత్తు పనులు నాణ్యతగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్ తో పాటు పర్యవేక్షణ అధికారులపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. లీకుల వలన పలు ప్రాంతాల్లో త్రాగునీరు వృధా అవ్వడం వలన శివారు ప్రాంతాలకు సమగ్రంగా ఇవ్వలేకపోతున్నామని, అటువంటి లీకులను గుర్తించి, ప్రస్తుత షట్ డౌన్ సమయంలోనే పూర్తీ చేసేలా ఏ.ఈ.లు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవిలో నగరంలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ., ఈ.ఈ.లను ఆదేశించారు. పర్యటనలో ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ.లు శాంతిరాజు, సుందర్రామిరెడ్డి, డి.ఈ.ఈ.లు శ్రీనివాసరెడ్డి, మహ్మద్ రఫిక్, ఏ.ఈ.లు సేతుబాబు, సునీల్ కుమార్, సచివాలయ ఎమినిటి కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *