-అనస్య పుట్టినరోజు వేడుకల్లో పిల్లలతో కలిసి పాల్గొని కేక్ కట్ చేసిన కలెక్టర్
-ప్రతి స్కూల్ లో తప్పనిసరిగా ఎగ్ కలర్ చార్ట్ ప్రదర్శించాలి
-సదరం ధ్రువ పత్రం లేని వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలి
-పంపిణీ చేయడం లో ప్రతి విద్యార్థి కి కిట్స్ అందచెయ్యలి
-కలెక్టర్ కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం విద్య కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహరాన్ని అమలు నిబద్దత కలిగి ఉండాలని పేర్కొనడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత అన్నారు.
బుధవారం మధ్యాహ్నం తాడితోట మునిసిపల్ ఎం పి స్కూల్ భవిత ఉప కేంద్రం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలతో మాట్లాడుతూ, ఆ స్కూల్ లో ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లల కోసం చేపడుతున్న చర్యలు పై వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి పిల్లల పట్ల , వారిలో మానసిక పరిపక్వత, శారీరక దారుఢ్యం పెంపు దిశగా చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక పై వివరాలు తెలుసుకున్నారు. మానసిక ఆరోగ్య స్థాయి పెంచే విధానంలో నిరంతర అభ్యాస ప్రక్రియను చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. ఫిజియోధెరఫిస్ట్ లు ద్వారా క్రమం తప్పకుండా వ్యాయామం చేయించడం జరుగుతున్నట్లు తెలిపారు. రెగ్యులర్ గా మెడికల్ చెక్ అప్ లు నిర్వహించి, తగిన మందులు అందచెయ్యడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అక్కడ విద్యార్థులకు ఏ విధంగా ఏ ఏ రోజుల్లో ఫిజియోథెరపీ అందజేయడం జరుగుతుందో డాక్టర్ మధుశ్రీ కలెక్టర్ కు వివరించారు. పిల్లలు అందరికీ కీట్స్ అండచేయ్యా లని స్పష్టం చేశారు. విద్యార్థుల మధ్య వ్యత్యాసం చూపరాదని పేర్కొన్నారు.
కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థుల తల్లితండ్రులు:
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి వచ్చిన సందర్భంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు దివ్యాంగుల పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఆమేరకు ఆ పిల్లల పెన్షన్ కోసం ముఖ్యమంత్రి ఆదేశాలతో పెన్షన్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా పిల్లలకు పెన్షన్ సౌకర్యం లేకపోతే వారి వివరాలు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద తో తమ పిల్లలకు పెన్షన్ వచ్చే ఏర్పాట్లు చేయడం పట్ల ప్రత్యేక అవసరాల కలిగినా పిల్లల తల్లిదండ్రులు కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. మరి కొందరి విషయం లో తాత్కాలిక సదరం సర్టిఫికెట్ లు మాత్రమే ఉండటం పై ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా, శాశ్వత సర్టిఫికెట్ లు లేని కారణం గా వికలాంగుల కు రావాల్సిన పెన్షన్ లు ఆగి పోయాయని ఐ ఈ ఆర్ టీచర్ వరలక్ష్మి కలెక్టర్ కువివరించారు. ఆ అంశం పై తగు చర్యలు తీసుకోవాలని, డి ఎమ్ అండ్ హెచ్ ఓ, డి ఆర్ డి ఎ పి.డి , డి ఈ వో లని కలెక్టర్ ఆదేశించారు. తమ పిల్లలను ఇక్కడ భవిత సెంటర్ లో చేర్చిన తర్వాత వారిలో ప్రగతి బావుందని కలెక్టర్ కు వివరించారు. జిల్లాలో మొత్తం 19 భవిత ఉప కేంద్రాల ఏర్పాటు చెయ్యడం ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకం పై దిశా నిర్దేశం:
అనంతరం ఎన్ వి ఆర్ ప్రాధమిక పాఠశాల లో మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ మాధవీలత పరిశీలించారు . వారంలో ఏ రోజు ఏ రంగు స్టాంపు వేసిన కోడిగుడ్లు వస్తున్నాయో అన్న సమాచారాన్ని బోర్డు రూపంలో ప్రదర్శించనందుకు ప్రధానోపాధ్యాయులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో నిర్వహణలో ప్రతి అంశం పట్ల ప్రధానోపాధ్యాయులు పూర్తి నిబద్దతతో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం నెలలో ఏ వారంలో ఏ రంగు స్టాంప్ ఉన్న కోడి గుడ్డు అందజేస్తున్నారో, బహిరంగంగా ప్రదర్శన చెయ్యాలని స్పష్టం చేశారు.
కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం ,అర్బన్ రేంజ్ డి ఐ. బి. దిలీప్ కుమార్, డి ఆర్ డి ఏ పి.డి సుభాషిణి,ఐ.సి డి ఎస్ పి.డి, ఎన్ విఆర్ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే డేవిడ్ లివింగ్ స్టన్ , సమగ్ర శిక్షా కో ఆర్డినేటర్ స్నేహలత , నాన్ భవిత సెంటర్ ఐ ఆర్ టి టీచర్ వరలక్ష్మి,సి ఆర్.పి జయంతి శాస్త్రి పాల్గొన్నారు
Prajavartha Online Telugu News